జైశ్రీరామ్.
శ్లో. తృణాం ఖాదతి కేదారే జలం పిబతి పల్వలే దుగ్ధం యచ్ఛతి లోకేభ్యో ధేనుర్నో జననీ ప్రియా.
కం. పొలమున తృణమునె మేయుచు
జలములు పల్వలములందు చక్కఁగఁ గొనుచీ
యిలప్రజలకు పాలనొసగు
సులలిత గోదేవి మనకు చూడఁగ తల్లే.
భావము. పొలాలలో గడ్డి తింటూ , గుంటలలో నీళ్ళు త్రాగుతూ, లోకులకు పాలనిచ్చే ఆవు - కన్న తల్లి వంటిదే కదా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.