జైశ్రీరామ్.
ఆర్యులారా! వందనములు.
శ్రీనాధమహాకవికి సమకాలికుడైన కొఱవిగోపరాజు రచించిన
'సింహాసన ద్వాత్రింశిక' యనేగ్రంథములోని
భావగోపన ఆద్యక్షర బంధ సీసము.
సీ: రాజ్యంబు వదలక, రసికత్వమెడలక
జయశీలముడుగక, నయముచెడక
దీనుల ఁజంపక, దేశంబు నొంపక ,
నిజముజ్జగింపక, నేర్పుఁగలిగి ,
విప్రులఁ జుట్టాల, వెన్నుసొచ్చినయట్టి
వారిని ,గొల్చినవారి, ప్రజల
హర్షంబుతో గాంచి, యన్యాయముడుపుచు,
మున్నుజెప్పినరీతి జెన్నుమీరి
గీ: చేతలొండులేక, పాత్రులవిడువక ,
యశము కలిమి తమకు వశము గాగ ,
వసుధనేలు రాజవర్గంబు లోన న
య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను .
విక్రమాదిత్యునివద్దకు ఒకనిరుపేద బ్రాహమణుఁడు తనకుమార్తెను వెంటబెట్టుకొని వచ్చినాడు. ఈపిల్ల నాకుమార్తె. పెళ్ళియీడువచ్చినది. అయితే పేదరికంవలన ధనంలేక దీనికి పెళ్ళిచేయలేకపోతున్నాను. నీవు సహాయపడి యీపిల్లకు పెళ్ళిచేయవయ్యా! అనిఆద్యక్షర బంధ సీసములో అడిగెను. పద్యపాదాదివర్ణములు కలిపి చదివినచో ఈ విషయము బహిర్గతమగును. ఇదియే భావగోపన ఆద్యక్షర చిత్రము
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.