జైశ్రీరామ్.
శ్లో. అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ న విందతిససంతోషస్తథా నిత్యం త్రీణి శిక్షేత్ గార్ధభాత్.
క. నిరతము బరువును మోయుట,
వెరవక వేడికి చలికిని బ్రీతి మనుటయున్,
గరపును గాడిద మనలకుఁ
జరియింపఁగ వలయు నటుల చక్కగ మనమున్.
భావము. విశ్రాంతి లేకుండా భారం మోయుట, చలి ఎండలకు చలించకుండా వుండుట, నిత్యము సంతోషముగా నుండుట, ఈ మూడు లక్షణములు మనము గాడిద నుంచి నేర్చుకొనవలెను.
జైహింద్.
1 comments:
జంతు వైతేనేం గాడిదనుంచి నేర్చుకోవలసినది ఎంతో విలువైనది. మనుషుల కంటే జంతువులే నయం . బాగుంది మంచి సూక్తి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.