జైశ్రీరామ్.
శ్లో. అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరాఅనుగ్రహం చ దానం చ శీలమే తత్ప్రప్రశన్యతే (మహాభారతం అను. 124-66)
తే.గీ. కరణములు మూటిచే వైరి కాక యుంట,
దయను వర్తిలుచుండుట ప్రియము తోడ,
దాన సద్గుణౌఁడుచునీ ధరణి నుంట
శీలవంతుల లక్షణ జాలమరయ.
భావము. ప్రాణులన్నిటి యందు మనోవాక్కాయ కర్మలచే వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు, దానముచేయుటయు శీలముగా ప్రశంసింపబడుచున్నది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.