గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2018, శుక్రవారం

భాషాపరమయిన గుణదోషములరయుటకు వ్యాకరణ గ్రంథావశ్యకత మనమెఱుఁగనిది కాదు.

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
అంతర్జాలములో ప్రజ పద్యం, మున్నగునవి భాషాభిలాష కలిగించుటకు చేయుచున్న కృషి మూలముగా తెలుఁగు భాషలో ఛందోబద్ధ కవితాభిలాష వృద్ధి చెంది పద్యరచన చేయుటయే కాక, ప్రబంధ రచనకునూ కంకణ బద్ధులై రచించి తమ భాషాభిమానమును చాటుకొనుచున్న మహనీయులందరికీ, ప్రేరకులకూ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియఁజేసుకొనుచున్నాను.
మనమెంత అభ్యాసము చేయుచున్నను అది ఎప్పటికీ అసంపూర్ణమే అని మనకు కాలక్రమంలో అర్థమగుచుండును. నిరంతర సాధనయే మనము చేయఁగలిగిన పని.
భాషాపరమైన స్వచ్ఛత, నిర్దోషత, సాధించుటకు ప్రాచీన గ్రంథపఠనము చేయుచు, వ్యాకరణ గ్రంథములు సాధన చేయుట అత్యవసరమని మనకు అనుభవైకవేద్యము.
అందులకే ఇచ్చట చిన్నయ సూరి విరచిత బాలవ్యాకరణము చూపించఁగలుగు సంకేతమునుంచుచున్నాను. దానితో సోధిణ్చినచో బాలవ్యాకరణము తెరచుకొనును. మనము ప్రతీ దినము సాధ్యమయినన్ని సూత్రములు సాధన చేయుచున్నచో భాష, పద నిర్మాణ క్రమములో గుణదోషములు స్పష్టమగును.
http://www.andhrabharati.com/bhAshha/bAlavyAkaraNamu/index.html
ఆంధ్రామృతమును మీరు అభిమానముతోఁ గ్రోలుచున్నందులకు ధన్యవాదములు.,
నమస్తే..
జైహింద్.
Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జైశ్రీమన్నారాయణ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.