గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2018, బుధవారం

యావద్భారత జాతికీ 72 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులార! 
నేడు భారత జాతికి 72వ స్వాతంత్ర్య దినోత్సవము.
ఈ సందర్భముగా మీకు శుభాకాంక్షలు.
భారత మాత బిడ్డలుగ భాసిలువారలు పుణ్యపాదులే,
కోరుచునుందురెల్లపుడు కోమల భారత దేశ వృద్ధినే.
నేరచరిత్ర లేని మహనీయులు భారతజాతివారు.నే
కోరెద నందరిన్ సుగుణకోమలసద్గుణ వృద్ధి చేయఁగన్. 
జాతికి స్వార్థ హీనులు నిజంబగు భక్తులు దేశభక్తిచే
ఖ్యాతి గడించు వారలె.  ప్రియంబుగ పల్కుచు మేలు చేయుచున్
నీతిగ వృద్ధి చెందెడి మనీషులఁ గొల్చెద భక్తి తోడుతన్. 
కాతర చేయనేల పలుకాకుల మూకల స్వార్థపూర్ణులన్.
భారతమాతరో! దురిత పాలకులన్, ఖలులన్ దహించుమా.
నేర చరిత్రులన్ దునుమి, నిర్భర సద్గుణ పుణ్యమూర్తులన్
కోరుచు పెంచుమా కృపను. కుంభినిఁ గల్గినవారలెల్లరున్
సారస చిత్తవృత్తులయి చక్కఁగ మెల్గఁగఁ జేయఁ బూనుమా.
వందే భారతమాతరమ్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.