గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2018, శుక్రవారం

వరలక్ష్మీ శుక్రవార శుభదినము సందర్భముగ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా శుభోదయమ్.
నేడు వరలక్ష్మీ శుక్రవార శుభదినము.
ఈ సందర్భముగా యావజ్జీవకోటిని శ్రీమాత కృపతో చూడాలని మనసారా కోరుకొంటూ
మీ అందరికి నా అభినందన పూర్వక శుభాకాంక్షలు తెలియఁజేయుచున్నాను.

లక్ష్మీదేవీముపాస్మహే.
దండక గర్భ సీసము.
శ్రీమన్మహాలక్ష్మి చిత్తాంబుజీద్భాసి - నిత్యంబు ప్రార్థించు నిష్టులైన
భక్తాళినే గాంచి, యుక్తిన్ ప్రభావించు. శక్తిన్ బ్రసాదించు. .సభ్యతనిడు.
స్తుత్యాత్మనే కొల్పు, శోభిల్లఁగా జేయు, నిత్యంబు రక్షించు నియతితోడ.
కాంచున్ సమస్తంబు కాపాడుచున్ తాను. కానన్ మదింగాంచుడీ. నమామి
హే రమా! సాథ్విరో కావవే సతమ్ము.
చేరి నిన్నున్  ప్రపూజించు వారిమమ్మ.
భాక్తి నిన్ గొల్చి ప్రార్థించు భాగ్యమిమ్మ.
లోక కల్యాణమే ధర్మమీకు తల్లి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.