జైశ్రీరామ్.
ఏకాక్షర కందములు
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 223వ పద్యము.లోలాళిలాలిలీలా
ళీలాలీలాలలేలలీలలలలులే
లోలోలైలాలలల
ల్లీలైలలలాలలోలలేలోలేలా
(ఇందులో ల-ళ లకు భేదము లేదు కావున పద్యమంతా
ల - అనే హల్లుతో కూర్చబడినదిగా భావించాలి)
ప్రతిపదార్థము.
లోల - చలించుచున్నట్టి,
అళి - తుమ్మెదలను,
లాలి - లాలించునట్టి,
లీలా - శృంగారక్రియగలిగినట్టి,
ఆళీ - చెలికత్తెలయొక్క,
లాలీ - లాలిపాటలయొక్క,
లాల - లాలయను పాటయొక్క,
ఏల - ఏలపదాలయొక్క,
లీలలు - విలాసములు,
అలలు - అతిశయములు,
లే - అవులే,
లోలో - లోలోయనే,
ల - స్వీకరించయోగ్యమయినట్టి,
ఐల - గుహలయందు,
అల - అఖండములయినట్టి,
లలత్ - కదలుచున్నట్టియు,
లీల - క్రీడార్థమయినట్టియు,
ఏలల - ఏలకీతీగలయొక్క,
లాల - ఉయ్యాలలు,
ఓలలు - హేరాళములే,
లోల - ఆసక్తిగలిగిన,
ఐలా - భూదేవిగల శ్రీవేంకటేశ్వరస్వామీ.
భావము..
ఆసక్తిగలిగిన భూదేవిగల శ్రీవేంకటేశ్వరస్వామీ! చలించుచున్నట్టి తుమ్మెదలను లాలించునట్టి శృంగారక్రియగలిగినట్టి చెలికత్తెలయొక్క లాలిపాటలయొక్క లాలయను పాటయొక్క ఏలపదాలయొక్క విలాసములు అతిశయములు అవులే లోలోయనే స్వీకరించయోగ్యమయినట్టి గుహలయందు అఖండములయినట్టి కదలుచున్నట్టియు క్రీడార్థమయినట్టియు ఏలకీతీగలయొక్క ఉయ్యాలలు హేరాళములే,
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.