గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2018, బుధవారం

తెలుఁగుభాషాదినోత్సవము సందర్భముగా యావదాంధ్రప్రజానీకానికి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తెలుఁగుభాషా దినోత్సవము సందర్భముగా మీకు శుభాకాంక్షలు.
తెల్గుఁ చిచ్చర పిడుగు గిడుగు
తెల్గుఁలో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి.
వీరి జన్మదినము 1863 ఆగష్టు 29,  
గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. 
గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
వీరు పరమపదించినది జనవరి 22, 1940..
తెలుఁగుభాషా దినోత్సవము సందర్భముగా మనము మన మాతృభాషను ప్రేమిద్దాం. గౌరవిద్దాం. మన భాషలో ఉన్న గొప్పవిషయాలను సమాజంలో చాటి ప్రకటిద్దాం.
జానపదములు సేకరిద్దాం.
జాను తెలుఁగును తెలియ చేద్దాం. 
పల్లెపాటలనాలపిద్దాం. 
పల్లె జనులను గౌరవిద్దాం.
జాతి ప్రగతికి బాట వేద్దాం.
తెలుఁగు తల్లిని గౌరవిద్దాం.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.