జైశ్రీరామ్.
వరదయా,మోహినీ,రక్షిత, పరాత్పర,నేపార,,మదెంచు ,ఉదయ,కర్మణీ,బిగిసడలు ,వ్రజా,తద్వర,తరింపు, జతసృజ,జతసుజనా,కృతకర్మ ,నిర్విరామ,సుధర్మ,మగ ధీర,పాఠసుగోస్థనీ,అని శ్చిత,మగటిమి,రాయల,తగ నొప్పు,లీలయా,అవని,ధర్మా చర,గర్భ"-చిరామయ"-వృత్త ము.(నక్షత్రమాల)రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-చిరామయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.న.భ.జ.త.త.జ. గగ.గణములు.యతులు.8,16,22.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు!తగనొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు!ధరాతలానన్?
మనుము కీర్తి నెంచి!మగధీర వరదాల!మర్మంబు లేకుండ! మరింత మేలై?
ధనము కర్మతబ్బు!తగురీతి నడు మంచి!ధర్మంబు నేపార!తరింపు గల్గున్!
పెనుగులాట మాను!బిగిలేని నడకేల?పేర్మిం గడింపంగ!విరించి మెచ్చున్?
1.గర్భగత"-వరదయా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.న.ర.ల.గణములు.వృ. సం.88.ప్రాసగలదు.
తను వశా శ్వతంబు
మనుము కీర్తి నెంచి!
ధనము కర్మ తబ్బు!
పెనుగులాట మాను!
2.గర్భగత"-మోహినీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.గల.గణములు. వృ.సం.188.ప్రాసగలదు.
తగనొప్ప నుదయించి!
మగధీర !వరదాల!
తగురీతి నడు మంచి!
బిగిలేని నడకేల?
3.గర్భగత"-రక్షిత"-వృత్తము.
గాయిత్రీఛందము.త.త.గణములు.వృ.సం .37.ప్రాసగలదు.
ధర్మంబు పాఠించు
మర్మంబు లేకుండ?
ధర్మంబు నేపార
పేర్మిం గడింపంగ!
4.గర్భగత"-పరాత్పర"-వృత్తము.
సుప్రతిష్టాఛందము.జ.గగ.గణములు. వృ.సం.6.ప్రాసగలదు.
ధరా! తలానం!
మరింత మేలై!
తరింపు గల్గం!
విరించి మెచ్చున్!
5.గర్భగత"-నేపారు"-వృత్తము.
అతిశక్వరీఛందము.న.ర.న.భ.జ.గణము లు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు!తగ నొప్ప నుదయించి!
మనుము కీర్తి నెంచి ! మగధీర వరదాల!
ధనము కర్మ తబ్బు!తగు రీతి నడుమంచి!
పెనుగులాట మాను !బిగి లేని నడ కేల?
6.గర్భగత"-మదెంచు"-వృత్తము.
ప్రకృతిఛందము.న.ర.న.భ.జ.త.తగణము లలు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు!తగ నొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు
మనుము కీర్తి నెంచి! మగ ధీర వర దాల! మర్మంబు లేకుండ?
ధనము కర్మ తబ్బు!తగు రీతి నడు మంచి!ధర్మంబు నేపార!
పెనుగు లాట మాను!బిగి లేని నడకేల? పేర్మిం గడింపంగ!
7.గర్భగత"-ఉదయ"-వృత్తము.
శక్వరీఛందము.స.న.ర.ర.గల.గణములు. యతి.9,వ.య్షరము.
ప్రాసనీమముగలదు.
తగ నొప్ప నుదయించి !ధర్మంబు పాఠించు!
మగధీర వరదాల !మర్మంబు లేకుండ?
తగు రీతి నడు మంచి!ధర్మంబు నేపార!
బిగిలేని నడ కేల? పేర్మిం గడింపంగ?
8.గర్భగత"-కర్మణీ"-వృత్తము.
అతిధృతిఛందము.స.న.ర.ర.భ.ర.గ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తగ నొప్ప నుదయించి ధర్మంబు పాఠించు ధరా తలానం!
మగధీర వరదాల!మర్మంబు లేకుండ?మరింత మేలై!
తగురీతి నడు మంచి!ధర్మంబు నేపార!తరింపు గల్గున్?
బిగి లేని నడ కేల?పేర్మిం గడింపంగ! విరించి మెచ్చున్!
9.గర్భగత"-బిగిసడలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.ర.ర.భ.ర.భ.జ. గగుగణములు.యతులు.9,15,20.
ప్రసనీమముగలదు.
తగనొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు,ధరాతలానం తను వశాశ్వతంబు!
మగధీర వరదాల !మర్మంబు లేకుండ?మరింత మేలై!మనుము కీర్తి నెంచి!
తగురీతి నడుమంచి!ధర్మంబు నేపార!తరింపు గల్గుం!ధనము కర్మ తబ్బు!
బిగిలేని నడకేల?పేర్మిం గడింపంగ!విరించి మెచ్చుం!పెనుగులాట మాను!
10,గర్భగత"-వ్రజా"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.త.త.జ.గగ.గణము లు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మంబు పాఠించు ధరా తలానన్!
మర్మంబు లేకుండ మరింత మేలై!
ధర్మంబు నేపార తరింపు గల్గున్?
పేర్మిం గడింపంగ విరించి మెచ్చున్!
11.గర్భగత"-,తద్వర"-వృత్తము.
ధృతిఛందము.త.త.జ.త.స.ర.గణములు. యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు!ధరాతలానం!తను వశాశ్వతంబు?
మర్మంబు లేకుండ!మరింత మేలై!మనుము కీర్తి నెంచి!
ధర్మంబు నేపార!తరింపు గల్గుం!ధనము కర్మ తబ్బు!
పేర్మిం గడింపంగ!విరించి మెచ్చుం!పెనుగు లాట మాను!
12.గర్భగత"-తరింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.జ.త.స.ర.స.న. గల.గణములు.యతులు.7,12.
ప్రాసనీమముగలదు.
ధర్మంబు పాఠించు ధరాతలానం!తను వశాశ్వతంబు?తగనొప్ప నుదయించి!
మర్మంబు లేకుండ!మరింత మేలై!మనుము కీర్తినెంచి!మగధీర వరదాల!
ధర్మంబు నేపార!తరింపు గల్గుం!ధనము కర్మ తబ్బు!తగురీతి నడు మంచి!
పేర్మిం గడింపంగ!విరించి మెచ్చుం!పెనుగులాట మాను!బిగి లేని నడకేల?
13.గర్భగత"-జతసృజ"-వృత్తము.
జగతీఛందము.జ.త.స.జ.గణములు.యతి. 6,వ.యక్షరము.
ప్రాసనియమముగలదు.వృ.సం.
ధరాతలానం!తను వశాశ్వతంబు?
మరింత మేలై?మనుము కీర్తి నెంచి!
తరింపు గల్గుం?ధనము కర్మ తబ్బు!
విరించి మెచ్చుం!పెనుగు లాట మాను!
14.గర్భగత"-జతసుజనా"-వృత్తము.
కృతిఛందము.జ.త.స.జ.స.న.గల.గణము లు.యతి.13.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధరాతలానం?తను వశాశ్వతంబు?తగ నొప్ప నుదయించి!
మరింత మేలై!మనుము కీర్తి నెంచి!మగధీర వరదాల?
తరింపు గల్గుం?ధనము కర్మ తబ్బు!తగు రీతి నడు మంచి?
విరించి మెచ్చుం?పెనుగులాట మాను!బిగి లేని నడకేల?
15.గర్భగత"-కృతకర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.స.జ.స.న.ర.ర. గల.గణములు.యతులు.6,13,21.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం!తనువశాశ్వతంబు?తగనొప్ప నుదయించి!ధర్మంబు పాఠించు!
మరింత మేలై!మనుము కీర్తినెంచి!మగధీర వరదాల!మర్మంబు లేకుండ?
తరింపు గల్గుం!ధనము కర్మతబ్బు!తగురీతి నడు!మంచి!ధర్మంబు నేపార
విరించి మెచ్చుం?పెనుగులాట మాను!బిగిలేని నడకేల ?పేర్మిం గడింపంగ!
16.గర్భగత"-నిర్విరామ"-వృత్తము
అతిశక్వరీఛందము.స.న.భ.స.జ.గణము లు.యతి9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
తగనొప్ప నుదయించి! తనువశాశ్వతంబు?
మగధీర వరదాల! మనుము కీర్తి నెంచి!
తగు రీతి నడు మంచి!ధనము కర్మ తబ్బు!
బిగి లేని నడకేల?పెనుగులాట మాను!
17.గర్భగత"-సుధర్మ"-వృత్తము.
ప్రకృతి ఛందము.స.న.భ.స.జ.త.త.గణములు.యతి .9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
తగనొప్ప నుదయించి!తనువశాశ్వతంబు!ధర్మంబు పాఠించు!
మగ ధీర వరదాల!మనుము కీర్తి నెంచి!మర్మంబు లేకుండ?
తగురీతి నడు మంచి!ధనము కర్మ తబ్బు!ధర్మంబు నేపార!
బిగి లేని నడకేల?పెనుగులాట మాను!పేర్మిం గడింపంగ?
18.గర్భగత"-మగధీర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.భ.స.జ.త.త.జ. గగ.గణములు.యతులు.9,16.
ప్రాసనీమముగలదు.వృ.సం.
తగనొప్ప నుదయించి!తను వశాశ్వతంబు!ధర్మంబు పాఠించు!ధరా తలానన్?
మగధీర!వరదాల!మనుము కీర్తి నెంచి!మర్మంబు లేకుండ!మరింత మేలై!
తగురీతి నడు మంచి!ధనము కర్మతబ్బు?ధర్మంబు నేపార!తరింపు గల్గన్?
బిగిలేని నడకేల?పెనుగులాట మాను!పేర్మింగడింపంగ?విరించి మెచ్చున్?
19.గర్భగత"-పాఠవ"-వృత్తము.
అతిజగతీఛందము.త.త.న.ర.ల.గణములు. యతి.7,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు! తనువశాశశ్వతంబు?
మర్మంబు లేకుండ!మనుము కీర్తి నెంచి?
ధర్మంబు నేపార! ధనము కర్మ తబ్బు?
పేర్మి గడింపంగ?పెనుగులాట మాను!
20.గర్భగత"గోస్థనీ"-వృత్తము.
ప్రకృతిఛందము.త.త.న.ర.న.భ.జ. గణములు.యతులు.7,14.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు!తనువశాశ్వతంబు?తగ నొప్ప నుదయించి?
మర్మంబు లేకుండ!మనుము కీర్తి నెంచి?మగధీర వరదాల?
ధర్మంబు నేపార!ధనము కర్మ తబ్బు?తగు రీతి నడు మంచి!
పేర్మి గడింపంగ?పెనుగులాట మాను!బిగి లేని నడకేల?
21.గర్భగత"-అనిశ్చిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.న.ర.న.భ.జ.జ. గగ.గణములు.యతులు.7,14,20,
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధర్మంబు పాఠించు!తను వశాశ్వతంబు?తగ నొప్ప నుదయించి!ధరాతలానన్!
మర్మంబు లేకుండ!మనుము కీర్తినెంచి?మగధీర వరదాల?మరింత మేలై!
ధర్మంబు నేపార!ధనము కర్మ తబ్బు!తగురీతి నడు మంచి!తరింపు గల్గున్?
పేర్మింగడింపంగ?పెనుగులాట మాను!బిగిలేని నడకేల?విరించి మెచ్చున్!
22.గర్భగత"-మగతన"-వృత్తము.
అతిజగతీఛందము.జ.త.జ.స.ల.గణములు. యతి.6,వయక్షరము.
ప్రాసనీమము గలదు.వృ.సం.
ధరాతలానం తగ నొప్ప నుదయించి?
మరింత మేలై! మగధీర వరదాల!
తరింపు గల్గుం?తగురీతి నడు మంచి!
విరించి మెచ్చుం?బిగిలేని నడకేల?
23.గర్భగత"-రాయల"-వృత్తము.
అతిధృతిఛందము.జ.త.జ.సఅతిధృతి గణములు.యతులు7,14.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం!తగ నొప్ప నుదయించి! ధర్మంబు పాఠించు?
మరింత మేలై!మగధీర వరదాల?మర్మంబు లేకుండ?
తరింపు గల్గుం?తగురీతి నడు మంచి!ధర్మంబు నేపార!
విరించి మెచ్చుం! బిగి లేని నడకేల?పేర్మిం గడింపంగ?
24.గర్భగత"-తగనొప్పు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.జ.స.ర.య.న.డ. గల.గణములు.యతులు6,14,20
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం?తగనొప్ప నుదయించిధర్మంబు పాఠించు?తను వశాశ్వతంబు!
మరింత మేలై!మగధీర వరదాల?మర్మంబు లేకుండ?మనుము!కీర్తి నెంచి!
తరింపు గల్గుం?తగురీతి నడుమంచి!ధర్మంబు నేపార!ధనము కర్మ తబ్బు!
విరించి మెచ్చుం?బిగి లేని నడకేల?పేర్మిం గడింపంగ?పెనుగులాట మాను?
25.గర్భగత"-లీలయా"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.జ.మ.ర.గల.గణము లు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరాతలానం?ధర్మంబు పాఠించు?
మరింత మేలై!మర్మంబు లేకుండ?
తరింపు గల్గుం!ధర్మంబు! నేపార!
విరించి మెచ్చుం?పేర్మిం గడింపంగ?
26.గర్భగత"-అవని"-వృత్తము.
అతిధృతిఛందము.జ.మ.ర.భ.జ.స.ల. గణములు.యతులు.6,12
ప్రాసనీమముగలదు.వృ.సం.
ధరా తలానం?ధర్మంబు పాఠించు?తగనొప్ప నుదయించి!
మరింత మేలై!మర్మంబు లేకుండ?మగ ధీర వరదాల!
తరింపు గల్గుం?ధర్మంబు నేపార!తగురీతి నడు మంచి?
విరించి మెచ్చుం?పేర్మిం గడింపంగ?బిగిలేని నడకేల?
27.గర్భగత"-ధర్మాచర"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.మ.ర.భ.జ.స.న.జ. గల.గణములు.యతులు.6,12,20.
ప్రాసనీమముగలదు.
ధరాతలానం?ధర్మంబు పాఠించు?తగనొప్ప నుదయించి!తను వశాశ్వతంబు?
మరింత మేలై?మర్మంబు లేకుండ!మగధీర వరదాల!మనుమ కీర్తి నెంచి?
తరింపు గల్గుం?ధర్మంబు నేపార!తగు రీతి నడు మంచి!ధనము కర్మతబ్బు?
విరించి మెచ్చుం!పేర్మింగడింపంగ!బిగిలే ని నడకేల?పెనుగులాట మాను.
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.