జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,సమాశ్రీ ,సుగంధి,యతిర్నవసుగంధి ద్వయ,కొంగుబంగరుద్వయ, రజీనీకరప్రియ, గర్భ"-గిరివరదమ"-వృత్త ము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.ల గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ఘాతుకాల కాలవాలమై!గడ్డు రోజు లావహించె!కాని పోని స్వార్ధ మార్భటిన్?
నీతి పాతి పాతళంబునం?నెడ్డి సాంప్రదాయ మెల్ల!నేను,నాదనెండు భావనన్!
మేత మేయు, గొడ్డు తీరునం!మెడ్డ జూచు!దుర్మదాన! మీన,మేష భ్రాంతి గొల్పుచున్?
దూతలౌచు మ్రింగ సంపదల్?దొడ్డిదారి గుంజుకోగ!తూనికేది?వీరి చింతకున్!
1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్త ములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
1.ఘాతుకాల కాలవాలమై! 2.కాని పోని స్వార్ధ మార్భటిన్!
నీతిపాతి పాతళంబునన్! నేను,నాదనెండు భావనన్?
మేత మేయు,గొడ్డుతీరునన్? మీన,మేష భ్రాంతి గొల్పుచున్?
దూతలౌచు మ్రింగ సంపదల్? తూనికేది? వీరి చింతకున్!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు. వృ.సం.171.ప్రాసగలదు.
గడ్డు రోజు లావహించె!
నెడ్డి సాంప్రదాయ మెల్ల!
మెడ్డ జూచు దుర్మదాన!
దొడ్డి దారి గుంజు కోగ!
3.గర్భగత"-సుగంధి"--వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల. గణములు.యతి.9,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
ఘాతుకాల కాలవాలమై!గడ్డు రోజు లావహించె?
నీతి పాతి పాతళంబునం!నెడ్డి సాంప్రదాయ మెల్ల?
మేతమేయు గొడ్డు తీరునం?మెడ్డ జూచు దుర్మదాన!
దూతలౌచు మ్రింగ సంపదల్!దొడ్డిదారి గుంజు కోగ?
4.గర్భగత"-యతిర్నవ సుగంధి"-ద్వయ వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గడ్డు రోజు లావహించె!కానిపోని స్వార్ధ మార్భటిన్?
నెడ్డి సాంప్రదాయ మెల్ల!నేను,నాదనెండు భావనన్?
మిడ్డ జూచు దుర్మదాన!మీన,మేష భ్రాంతి గొల్పుచున్?
దొడ్డిదారి గుంజుకోగ! తూనికేది?వీరి చింతకున్?
5.గర్భగత"-కొంగుబంగరు"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.ల గ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
1.గడ్డు రోజు లావహించె!కానిపోని స్వార్ధ మార్భటిం!ఘాతుకాల కాలవాలమై!
నెడ్డి సాంప్రదాయ మెల్ల!నేను,నాదనెండు భావనం?నీతి పాతి పాతళంబునన్!
మిడ్డ జూచు దుర్మదాన!మీన,మేష భ్రాంతి గొల్పుచుం?మేత మేయు గొడ్డు తీరునన్?
దొడ్డిదారి గుంజుకోగ!తూనికేది?వీరి చింతకుం?దూతలౌచు మ్రింగ సంపదల్!
2.గడ్డురోజులావహించె!ఘాతుకాల కాలవాలమై!కాని పోని స్వార్ధ మార్భటిన్!
నెడ్డి సాంప్రదాయమెల్ల!నీతి పాతిపాతళంబునం!నేను,నాదనెండు భావనన్!
మిడ్డ జూచు దుర్మదాన!మేత మేయు గొడ్డు తీరునం?మీన, మేష భ్రాంతి గొల్పుచున్?
దొడ్డిదారి గుంజుకోగ!దూతలౌచు మ్రింగసంపదల్?తూనికేది?వీరిచిం కున్!
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తసృ ము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.య తి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాని పోని స్వార్ధ మార్భటిం!ఘాతుకాల కాలవాలమై!
నేను,నాదనెండు భావనం!నీతి పాతి పాతళంబునన్!
మీన,మేష భ్రాంతి గొల్పుచుం?మేతమేయు గొడ్డు తీరునం.!
తూనికేది?వీరి చింతకుం!దూతలౌచు మ్రింగ సంపదల్!
7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గ ల.గణభులు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కానిపోని స్వార్ధ మార్భటిం!పఘధౌఎఓఊఅతుకాల కాలవాలమై!గడ్డు రోజులావహించె!
నేను,నాదనెండు భావనం?నీతిపాతి పాతళంబునం!నెడ్డి సాంప్రదాయమెల్ల!
మీన,మేష భ్రాంతి గొల్పుచుం?మేతమేయు గొడ్డు తీరునం?మిడ్డజూచు దుర్మదాన!
తూనికేది?వీరిచింతకుం?దూతలౌచు మ్రింగ సంపదల్!దొడ్డిదారి గుంజుకోగ!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
సృజనాత్మక గర్భకవితా శ్రవంతి(నూతన ఛందములలో)
పైపద్యమును చూచి!అవధాన శారదా
శ్రీయుతులు"-భద్రం వేణు గోపాలా చార్యులు
ఆముదాల వలస
శ్రీకాకుళం వారు యిచ్చిన అమూల్యాభిప్రాయము.
మత్తేభము.
శుభమై మంగళమై మహోన్నతమునై ధృక్క్శ్వాంతము ల్ప్రీతిగా
సభ మెచ్చంగను ఛందసమ్ము బహు విస్తారార్ధ పద్యాది, స
న్నిభమై వెల్గును మీదు సత్కవిత సు స్నేహమ్ము సాహిత్య, వ
ల్లభమై! శ్రీ నరసింహ సత్కృతివి నీ లక్ష్యంబు భోగ్యంబగున్!
ఇట్లు,
భద్రం వేణుగోపాలాచార్యులు.
ఆముదాలవలస. శ్రీకాకుళం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.