గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2018, సోమవారం

చూచిన చూడకుండు గుణి చూచిన చూపు . . . మహనీయులకు వాంఛనీయము.

జైశ్రీరామ్.
మగవారిచూపుపై రావిపాటి త్రిపురాంతకుని అంబికా శతకములోని పద్యము. 
లాఁచి పరాంగనల్ వరవిలాస మనోహర రూపసంపదన్
చూచిన చూడ డుత్తముడు, చూచిన చూచును మధ్యముండు. తా 
చూచిన చూడకుండినను చూచును నీచుడు. వీరిలోన నన్
చూచిన చూడకుండు గుణి చూచిన చూపున చూడుమంబికా!
శ్రీ వేటూరి వారు ప్రబంధరత్నావళిలో దీనిని స్వీకరించిరి.. 
వారికంటె మునుపు కొంత పాఠభేదంతో శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు దీనిని తొలిసారి ఉదాహరించిరి..
భావము.
ఓ జగదంబా. అందమైన ఆడవారు కనిపించి,వారుచూచినా తిరిగుచూడనివాడు ఉత్తముడు.
ఆడవారుచూస్తే తిరిగి చూచేవాడు నీచుడు.
వారు చూచినాచూడకున్నా పదే పదే చూచేవాడధముడు.
వీరిలో చూచినా చూడని మనోవిశుధ్ధిగలవాని చూపును అనుగ్రహింపుమమ్మా!.
స్వస్తి!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.