గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2018, శనివారం

గంధపాత్ర బంధ ఉత్పలమాల. రచన. కవయిత్రి పావులూరి సుప్రభ.

జైశ్రీరామ్.
గంధపాత్ర బంధ ఉత్పలమాల.
రచన. కవయిత్రి పావులూరి సుప్రభ.
ఉదయము వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారి గంధపాత్ర బంధము చూచి చాల రోజుల తరువాత బంధమొకటి ప్రచురించారని, దానిని పరిశీలించి వేరే పని చేసికొంటుండగా రెండు పద్యాలిచ్చారు. వానిలో ఒకటి.

వైద్యము వ్రాసినట్టి గతి వ్రాయఁగఁ జేయుదు- గంధపాత్రగా
హృద్యము గాగ పాత్రమది యింపగునట్టిది శిల్పశోభతో
చోద్యమె యౌను గూర్పదియుఁ జూడఁగ బంధము నట్టిరీతిలో
విద్యలతల్లికీవిడెడి ప్రేమపురస్కృతి గాఁగ నీయెడన్.
అది వ్రాసి, మంచిది అని అనగానే వారి బంధము ముందు పెట్టుకోమని చెప్పి, అల్లించినది పైని ఉత్పలమాల.
భాసురవాక్ప్రసారమునఁ బద్యము తియ్యఁగ సాగిపోవఁగా
వాసర దేవి రూపమదె భావితమై మది వెల్గులీన, నా
భాసము గానలేక తమి పారఁగ, మోక్షమునందు కోర్కెతో
వాసిగఁ జేతు సన్నుతులు భాః కరి శేముషి నీయ మేలుగా.
స్ఫూర్తిదాయకమైన బంధమును ప్రచురించిన ఆచార్యులవారికి ధన్యవాదశతములు. వందనములు.
స్వస్తి.
సుప్రభ
12:15 ఫం
08-07-2018.
కవయిత్రి సుప్రభ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ సుప్రభ గారికి అభినందనమందారములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.