గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2017, బుధవారం

గురుర్బ్రహ్మ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః.
క. గురువే బ్రహ్మయు విష్ణువు
గురువే పరమేశ్వరుండు కూర్మిని గాంచన్
గురువే పర బ్రహ్మమట్టి
గురువునకేనంజలింతు గురుదేవ హరీ!
భావము. గురువే సృష్టికర్తయగు బ్రహ్మ. గురువే మనకు విష్ణువు. పరమేశ్వరుఁడు కూడా గురువే. అట్టి గురువు సాక్షాత్తు బ్రహ్మపదార్థమే. అట్టి గురువునకు నేను నమస్కరుంచుచున్నాను. 
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహెశ్వర
ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.