జైశ్రీరామ్.
శ్లో. యత్ కటాక్ష సముపార్జనా విధిః - సేవకస్య సకలార్థ సంపదః.సంతనోతి వచనాంగ మానసైః - తామ్, మురారి హృదయేశ్వరీమ్ భజే.
గీ. సకల పురుషార్థ సంపద లొసగు నెట్టి
లక్ష్మి క్రీఁగంటి చూపుఁ దలచి భజించు
సేవకుల కట్టి హరిపత్ని! సేవఁజేతు
మనసు వాక్కాయ కర్మలన్ మహిని నీకు.
భావము. ఓ వరలక్ష్మీదేవీ! ఏ తల్లి క్రీగంటి చూపు నారాధించుట సేవకునకు సకల పురుషార్థ సంపను సమృద్ధిఁగ కలిగించునో అట్టి మురారి హృదయేశ్వరివైన నిన్ను వాక్కాయ మానసములతో సేవించెదను.
జైహింద్.
1 comments:
నమస్కారములు
వరలక్ష్మీ దేవికి పాదాభి వందనములు నిజంగా మేలిమి బంగారం మన సంస్కృతి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.