జైశ్రీరామ్.
శ్లో. అతి రమణీయే కావ్యే పిశునోన్వేషయతి దూషణాన్యేవ.అతి సుందరేపి వపుషి వ్రణమేవహి మక్షికా నికరః.
క. దుష్టుఁడు నిరతము తప్పుల
నిష్టంబుగ వెదకుఁ గృతుల నేర్పడు గుణముల్
స్పష్టంబుగ కనుట మదికి
కష్టంబగు. కనగ మక్షికాన్యాయమిదే.
భావము. ఈగ అందమైన శరీరముపై వ్రాలుటకిష్టపడదు. సరికదా వ్రణములపై వ్రాలుటకే ఎంతో ఇష్టపడును. అటులనే అతి రమణీయ కావ్యమున దుష్టుఁడు దోషముల కొఱకే అన్వేషించును. గుణములున్నను గ్రహింపనేఱడు కదా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును దుష్టులు కుత్సిత బుద్ధితొ మంచిని మెచ్చుకోవడానిక్ ఇష్టపడరు.దోషములను వెదికి వారి పేరును పడగొట్ట డానికె చూస్తారు. ఖచ్చితమైన నిజం . చక్కగా చెప్పారు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.