జైశ్రీరామ్.
శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులవారు రచించిన శ్రీమహాభారత సభాపర్వము సభా విజ్ఞానసమీక్ష గ్రంథావిష్కరణము.
ఈ సందర్భముగా శ్రీ దంపూరి దుర్గాప్రసాద్ గారి దుర్యోధన మయసభ ఏకపాత్రాభినయము ప్రేక్షకులకృదయాలను కట్టిపడేసింది.
తదనంతరం
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామానుజజీయర్ స్వామివారి చేతులమీదుగా గ్రంథావిషరణ జరిగింది.
శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారు, డా. శలాక రఘునాథశర్మ గారు, డా. సముద్రాల వేంకట రంగ రామానుజాచార్యులవారు, శ్రీ చిలకపాటి విజయరాఘవాచార్యులు మున్నగువారు గ్రంథ సమీక్షను అనేక కోణాలలో తమ ఉపన్యాసాలద్వారా ఆవిష్కరించారు. నేను ఆశువుగా కవిని ప్రశంసించాను.
శా. శ్రీమద్వేంకట రాజగోపకవియే చిత్తంబులుప్పొంగగా
ప్రేమన్ వ్రాసిరి జ్ఞానదీప్తిని సభా విజ్ఞానమున్ పాఠకుల్
క్షేమంబొంద పఠింపనెంచి, మహితుల్ శ్రీవాణి సద్రూపులే
శ్రీమల్లక్ష్మి శుభంబులన్ గొలుపుతన్ చేదోడుగా నిల్చుచున్.🙏🏻
జైహింద్.
Print this post-images-0.jpg)
-images-1.jpg)
-images-2.jpg)
-images-3.jpg)






వ్రాసినది












1 comments:
తిరుమల వంశ వైజ్ఞానిక సహజ గంధ పరిమళాలు మా అన్నయ్య రాజ గోపాలుని ద్వారా బ్రహ్మ సభ అంటే సత్య లోకం వరకూ ఈ సభా పర్వ రచన ద్వారా వ్యాపించడం అత్యంత ముదావహం.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మా అన్నయ్య ఎందరికో స్ఫూర్తి ప్రదాత !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.