గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2025, బుధవారం

అవధానపుష్కరిణి సంపుటి 1 సంచిక 4(22 - 12 - 2025)లో నా వ్యాసము.... గర్భకవిత్వము.

 జైశ్రీరామ్
అవధాన విద్యా వికాస పరిషత్
- అవధాన పుష్కరిణి
కవిత్వము చతుర్విధములు. ప్రాచీనాంధ్ర లక్షణకర్తలు ఆశు - మధుర - చిత్ర - విస్తర అని కవిత్వమును వివరించారు. ఈ చతుర్విధ కవిత్వము చెప్పగలుగుటయే కవి పరిపూర్ణతా
లక్షణముగా అభిప్రాయము కుదురుకొన్నది. అప్పకవి తన అప్పకవీయము 4వ ఆశ్వాసములో 549 వ పద్యమునుండి 608వ పద్యము వరకు చిత్రకవిత్వానికి సంబంధించిన చిత్ర కవిత్వము, బంధకవిత్వము, గర్భకవిత్వము
వివరించాడు.
ఆ.వె. మృదుల కవితరీతి మేదురమౌ చిత్ర
కవితగూడ కవికిఁ గాంక్షఁ గొలుపు పూలదండ యట్లు ముత్యాలదండయుఁ గన్నులున్న వాన్కిఁ గాంక్ష నిడదె?
అని శ్రీ విక్రాల శేషాచార్యులు చిత్రకవితను ప్రశంసించారు. కవిత్వమనేది మామూలు మాటలతో చెప్పుకొంటూపోతే అతి పేలవంగా ఉండి అందులో కవితామృతము స్రవించదు. కావుననే కావ్యము ధ్వని ప్రధానమైనదని, కావ్యమునకు ఆత్మ
ధ్వని యని లాక్షణికులు వక్కాణించారు.
అర్థాలంకారములు, శబ్దాలంకారములు, ఏ విధంగా కావ్యకాంతకు తొడవులో, అదే విధంగా శబ్దచమత్కారము, అర్ధచమత్కారము, పాఠకుల మనసును ఆనందపారవశ్యానికి లోనయ్యేటట్లు చేస్తాయి. రచనలో చిత్రకవిత్వముకన్నా గొప్పగా మరొకటి చమత్కారాన్ని కలిగించదంటే అది అత్యుక్తి కానేరదు. ప్రస్తుతం గర్భకవిత్వమును తెలుసుకొనే ప్రయత్నము చేద్దాం. లక్షణబద్ధమైన వృత్తపద్యము పఠించడానికైనా, ఆలపించ దానికైనా ఎంతో మనోరంజకంగా ఉంటుంది. దానికి తోడు అదే వృత్తంలో మరొక కందపద్యమో లేక అనేక కందపద్యములో,
గీతపద్యమో భావ సారూప్యతతో కాని, భావవైవిధ్యంతో కాని రచింపబడితే చదువడానికి ఆసక్తి చూపని సహృదయపాఠకుడు ప్రహేళికా కవుల మాటలకు - సందర్భాన్ని బట్టి ఛలోక్తులు, హాస్యోక్తులు, వ్యంగ్యోక్తులు అమితానందాన్ని కలుగజేస్తాయి. ఒక్కోసారి ఒక్క అక్షరంతోనే ఆ పదాలలోని అర్థాలు మారి, అందాన్ని కలిగింపజేసి, మానసిక ఆనందాన్ని వికసింపజేస్తాయి.
ఒక కవి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి నడిచి వెళ్తున్నాడు. ఎండాకాలం, దాహం వేస్తోంది. ఒక బావి దగ్గర ఒక వనిత నీళ్ళు తోడుతూ కనిపిస్తుంది. ఆ కాలంలో జనులకు అందరికీ సంస్కృత జ్ఞానముండేది. అపుడాకవి ఆమెతో అంటాడు శ్లో॥ పానీయం పాతుమిచ్ఛామి త్వత్తః కమలలోచనే
=
యది దాస్యసినేచ్ఛామి న దాస్యసి పిబామిచ ॥ అని అంటే, త్వత్తః = నీనుండి; పానీయం = నీరు; పాతుం = త్రాగడానికి; ఇచ్చామి = కోరుచున్నాను; యది = = ఒకవేళ;
ఉంటాడా? అలాగే ప్రకటింప బడిన ఒక పద్యంలో మరొక
ఛందస్సు సలక్షణముగా
అంతర్జాల మాస పత్రిక
| గర్భకవిత్వము |
పొదిగి ఉందని చూపిస్తే ఎవరికి ఆశ్చర్యం కలిగించదు? నేను అనువదించి నా తల్లిదండ్రులకు అంకితము చేసిన
శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయంలో 47వ శ్లోక అనువాదాన్ని గమనించండి.
సంజయ ఉవాచ సంజయుఁడు ఇట్లు పలికెను.
శ్లో. ఏవముక్త్వార్జునః సఖ్యే రథోపస్థ ఉపావిశత్ ||
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥ 1-47 తే.గీ. అని పలికి యర్జునుందట మనమున విల పించుచు ఖిల మానసుడయి, భీతిని హరి నుడువులు రథమును విన కను దిగి యమ్ము -లు నిక విల్లు విడిచె, హా మదినికలగుచు. ఈ తేటగీతిలోనే కందపద్యం చక్కగా ఇమిడి ఉందంటే
నమ్మకుండా ఎలా ఉండగలరు? పరికించండి. అని పలికి యర్జునుండట
కం.
మనమున విలపించుచు ఖిల మానసుడయి, భీ తిని హరి నుడువులు (రథమును )
వినకయె దిగి, యమ్ములు నిక విల్లు విడిచె. హా! భావము: సంజయుడు ఇట్కుపలికెను. అర్జునుడు ఇట్లు పలికి
శోకముతో నిండి యున్న మనస్సుతో యుద్ధభూమిలో బాణములతో సహాధనుస్సును వదిలి రథము వెనుక భాగములో కూర్చొనెను.
తేటగీతి ఎలా ఉన్నదో కందమూ అలాగే ఉన్నది. ఇట్టి చమత్కారాలు ఇందులో భావవైరుద్ధ్యము లేదు. ఇందలి చమత్కారమేమనగా చిత్రకవిత్వములో కోకొల్లలుగా ఉన్నాయంటే ఆశ్చర్యపడనక్కరలేదు. - చింతా రామకృష్ణారావు.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.