గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2025, ఆదివారం

అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన అన్నమాచార్య సంగీత పీఠం వ్యవస్థాపకులు సుబ్బలక్ష్మి అక్కయ్య మనకింక లేరు.

ఓం నమశ్శివాయ.

శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి.(86)
https://youtube.com/shorts/LL86-_ImtII?si=5-9cBqPkzi7Mim0Z

అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి అక్కయ్య (86) చోడవరంలోని ఆమె స్వగృహంలో (తే.13 - 12 - 2025) శనివారం కన్నుమూశారు. చోడవరం ప్రాంతంలో సంగీత సాహిత్యాలలో ఎక్కువమంది శిక్షణ పొందాలని ఆమె ఆకాంక్షించేవారు. అదే నేపథ్యంలో ఆమె పీఠాన్ని ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలునిర్వహించారు. తమ సొంత నిధులను ఖర్చుచేసి ఎంతోమంది సంగీత సాహిత్య ప్రముఖులను చోడవరం రప్పించడంలో ఆమె పాత్ర ఉండేది. కొంతమంది శిష్యగణాన్ని తయారు చేసుకుని, నిరంతరం ఏదో కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆమె భౌతికకాయానికి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 

ఉ.  తమ్ముడుగా ననుం గనుచు ధార్మికమార్గమునందు నిల్పి, లో
కమ్మున గౌరవప్రభలు కల్పనచేసిరి మెచ్చుకొంచు, సా
ధ్యమ్మగునన్నియున్ననుచు తానొనరొంచుచు చూపినారు,   వే
దమ్ములు చూపు శంకరుండు ముక్తినొసంగుత సుబ్బలక్ష్మికిన్.

అక్కయ్య మరణమునకు మిక్కిలి చింతించుచు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొనుచు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియఁజేస్తున్నాను.
ఓం శాంతిః.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.