గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2025, శనివారం

ఈ రోజు జరిగిన బాలాంత్రపు రమణగారి ప్రభావతీపద్యుమ్నము పరిచయము గ్రంథ ఆవిష్కరణ, మరియు ... అవధానపుష్కరిణి నవంబరు౨౦౨౫ మాసపత్రిక ఆవిష్కరణ.

జైశ్రీరామ్.

ఈ రోజు రవీంద్రభారతిలో జరిగిన శ్రీ బాలాంత్రపు రమణ గారి ప్రభావతీప్రద్యుమ్న గ్రంథ పరిచయ గ్రంథావిష్కరణ సభలో.

ఓం శ్రీమాత్రే నమః🙏🏻
బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ.(సభాధ్యక్షులు)

శా.  సన్నాముల్, మహనీయవాగ్ధిషణులున్, సంస్కారసంపన్నులున్,
పున్నెంబుల్ మనకున్ ఫలింప నిచటన్ పూజ్యంబుగా నిల్చి రీ
మన్నింపంబడు వేదికన్, సుగుణ సమ్మాన్యుల్ శుభోద్భాతి శ్రీ
మన్నారాయణులన్ గణించెదను  రాశీభూత చేతోనిధిన్.🙏🏻

డా. వెల్దండి నిత్యానందరావు(ముఖ్య అతిథి)
🙏🏻
కం.  నిత్యానందులు మహితౌ
న్నత్యముతో వెలిగె సభ ననన్య శుభదులై,
స్తుత్యులు, వీరికి శుభములు
నిత్యము దైవంబు గొలుపు, నిరిపమ గతితోన్.🙏🏻

శ్రీ ఏల్చూరి ములళీధరులు.(గ్రంథ సమీక్షకులు)
🙏🏻
మ.  ఘన యేల్చూరి వరాన్వయుండు మురళీ కల్యాణమూర్తిన్, సభన్
ప్రణవోద్భాస మహత్వ మూర్తిగ నిటన్ భాషించుటన్ గాంచితిన్,
ఘన చిత్రాద్భుత సత్కవిత్వ నిరతున్ గణ్యాత్మునిన్ గొల్చెదన్,
వినయోద్భాసితు లైన వీరు శుభముల్ విఖ్యాతిగా నొందుతన్. 🙏🏻

శ్రీమతి రాధగారు.(గ్రంథముద్రణ చేయించినవారుUSA)
🙏🏻
ఉ.  సాధన చేసి సత్కృతులు చక్కగ వ్రాసిన నచ్చు వేయగా
మోదము చూపు రాధ గుణమున్ వచియింపగ సాధ్యమౌనె,  యు
ద్బోధయె యీమె వర్తనము, పూజ్యులు వీరల కంజలింతు, సం
పాదన తోడ మంచిని నిబద్ధతఁ జేసెడి వీరె వాణియౌన్.🙏🏻

వాసంతి.(సభా నిర్వహణ)
👍
శా.  శ్రీవాసంతి కుమార్తెయా రమణకున్? చేదోడు వాదోడుగా
సేవల్ చేసెడి పుత్రుఁడే, జనకునిన్ సేవించు సద్రూపమే,
శ్రీ వాణీ గిరిజా స్వరూపమె కనన్, చిద్రూపమే యీ సభన్,
శ్రీ వేదాంబ శుభంబు లిచ్చుత సదా చిన్మూర్తి వాసంతికిన్.👍

బాలాంత్రపు రమణ గారు.(గ్రంథ కర్త)
🙏🏻
శా.  శ్రీ బాలాంత్రపు సుప్రసిద్ధ రమణుల్, శ్రీ మన్మహా కావ్యముల్
నాబోంట్లున్ గ్రహియింపఁ గల్గుటకు జ్ఞానోద్భాస సద్వ్యాఖ్యలన్
శ్రీ బాలా కరుణాకటాక్షములచే శ్రేష్ఠంబుగా చేసినా,
రీ బాలాంత్రపు వంశ్యు లందు శుభముల్ హృద్యంబుగా నిత్యమున్.

ఆ.వె.  పరిచయంబు నిట ప్రభావతీప్రద్యుమ్న
మునకు చేసినారు ఘనముగాను,
రాణగాంచినట్టి రమణను పొగడగ
చాలనయ్య నేను సత్యమిదియె.
🙏🏻
గ్రంథకర్త బ్రహ్మశ్రీ రమణ గారికి మియాపూర్ సాహితీమిత్రమండలి సత్కృతి,

అదే సభలో
అవధాన పుష్కరిణి నవంబరు 2025 మాసపత్రిక
ఆవిష్కరణ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.