జైశ్రీరామ్.
పార్వతీకల్యాణం.... సందర్భంలో కాని, నిత్యం మన గృహాల్లో జరిగే పెండ్లిళ్ళలో కాని పాడుకొనే అత్యద్భుతమైన అతి ప్రాచీనమైన మంగళ హారతి పాట ఎంత బాగుందో ఇది విని గ్రహించగలరు.
ఘల్లు ఘల్లున పాద ( అర్ధ నారీశ్వర మంగళ హారతి)
రచన: సాంప్రదాయ మంగళ హారతి
రాగం : మాధ్యమావతి తాళం : మిశ్ర చాపు శృతి: 6 (A)
ఘల్లున ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకల కలికి ఎక్కడికే
జడలోన గంగను ధరియించుకొన్నట్టి
జగములేలేడు సాంబశివుని సన్నిధికే
మంగళం మంగళం ॥
హెచ్చు పాపిట బొట్టు రత్న కిరీటము
ఏవమ్మా కరుణాకటాక్షి ఎక్కడికే
కడు పెద్ద రుద్రాక్షలు మెడలో హారముగా దాల్చి
స్థిరముగా వెలసిన శివుని సన్నిధికే
మంగళం మంగళం ॥
చెంగావి చీర కొంగులు జారంగ
రంగైన నవ మోహనాంగి ఎక్కడికే
పులితోలు వస్త్రము భూతిని ధరియించి
మండలమేలే జగదీశు సన్నిధికే ||
బొండు మల్లెలు జాజి దండలు మెడ నిండ
అందమెరిగిన జగదంబ ఎక్కడికే
అందము విభూతి అలరు శ్రీ గంధము
అలదిన నీల కంఠేశు సన్నిధికే
మంగళం మంగళం ॥
తళతళమను రత్నతాటంకములు మెరయ
పసిడి కుండలములపడతి ఎక్కడికే
చంద్రుని శిరస్సున ధరియించుకొన్నట్టి
గురుడైన భోళా శంకరుని సన్నిధికే
మంగళం మంగళం ॥
సన్నపు నడుముపై బిళ్ళల వడ్డాణము
మెరిసేటి బంగారు బొమ్మ ఎక్కడికే
కన్నులు మూడు భుజంబులు నాల్గు గల
అర్ధనారీశు ఆ శివుని సన్నిధికే
మంగళం మంగళం ॥
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.