జైశ్రీరామ్
శ్లో𝕝𝕝 యత్ర విద్వజ్జనో నాస్తి - శ్లాఘ్యస్తత్రాల్పధీరపిల్
నిరస్తపాదపే దేశే - ఏరణ్డోఽపి దృమాయతేల్
తే.గీ. వృక్షములు లేని చోటులన్ పృథివిపైన
నాముదపు వృక్షమే ఘనంబరసి చూడ,
పండితులు లేని చోటులన్ వరలు ఘనత
నల్పమైనట్టు జ్ఞానియుననుపమముగ.
తా𝕝𝕝 వృక్షములు లేని ప్రదేశమునందు ఆముదవృక్షము మహావృక్షమెట్లు
అగుచున్నదో అట్లే పండితులు లేని చోట అల్పజ్ఞానం కలవాడు కూడా
పండితుడగుచున్నాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.