గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

కుమతి,కుటిలత,విమలత,భములు,మమత,చరిత,బిటుత,కటుత,పటుత, శరణ్య,పవర,అశాశ్వత,ఎడము,గర్భ"-వివరిత"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.

కుమతి చరుల లోకమున్!కుటిల మెటుల బాయునో?కువలయంబు
                                                                                నందునన్!
విమల చరిత దూరమౌ!బిటుత కనగ రానిచోన్!వివరితంబు మృగ్యమౌ!
భముల జనము గీడ్పడున్!పటుత నెడము కాబడున్!పవరమే శరణ్యమౌ!
సమత మమత పెంచుమా!జటిల మదియు కాదిలన్!జవ మశాశ్వతంబులే!

సృజనాత్మక గర్భకవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందము లోని"ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు,26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-కుమతి"-వృత్తము.

కుమతి చరుల లోకమున్!
విమల చరిత దూరమౌ!
భముల జనము గీడ్పడున్!
సమత మమత పెంచుమా!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-కుటిలత"-వృత్తము.

కుటిల మెటుల బాయునో?
బిటుత కనగ రానిచోన్!
పటుత నెడము కాబడున్!
జటిల మదియు కాదిలన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును.

3,గర్భగత"-విమలత"-వృత్తము.

కువలయంబు నందునన్!
వివరితంబు మృగ్యమౌ!
పవరమే శరణ్యమౌ!
జవ మశాశ్వతంబులే!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"-భములు"-వృత్తము.

కుమతి చరుల లోకమున్!కుటిల మెటుల బాయునో?
విమల చరిత దూరమై!బిటుత కనగ రానిచోన్!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.