గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

చాటుమాటు,చేరు,దెబ్బతీయు,వాట మేర్చు,చీటి చింపు,వాట మేర్చు,వెక్కి రించు,మారని తీరు,గర్భ"-అగమ్య"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

దారి గోతుల నాతి చూపుల్!తాట దీసెను జీవ ధాత్రిన్!తారు గమ్య మగమ్యమై!
సారి సారికి వెక్కి రింపన్!చాటు మాటున దెబ్బ తీసెన్!చారు శీల వికారతన్!
పారె లోకము చిక్కి భీతిన్!వాట మేర్చిన దోష కన్యై!వారు వీరని యెంచకన్!
చేరె నక్రమ విక్ర మార్కమ్!చీటి చింపును నిక్కు వంబై!చేర జేయును కాలునిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత ఉత్కృతి
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-తారు గమ్య "-వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!
సారి సారికి వెక్కి రింపన్!
పారె లోకము చిక్కి భీతిన్!
చేరె నక్రమ విక్ర మార్కమ్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-చారు శీల"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!
చాటు మాటున దెబ్బ తీసెన్!
వాట మేర్చిన దోష కన్యై!
చీటి చింపును నిక్కువంబై!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-తారతమ్య"-వృత్తము.

తారు గమ్య మగమ్యమై!
చారు శీల వికారతన్!
వారు వీరని యెంచకన్!
చేర జేయును కాలునిన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"-మార్గము"-వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!తాట దీసెను జీవ ధాత్రిన్!
సారి సారికి వెక్కి రింపన్!చాటు మాటున దెబ్బ తీసెన్!
పారె లోకము చిక్కి భీతిన్!వాట మేర్చిన దోష కన్యై!
తీరు మారునె?భ్రాంతి గాకన్!చీటి చింపును నిక్కు వంబై!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును .
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-సారి సారికి"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!దారి గోతుల నాతి చూపుల్!
చాటు మాటున దెబ్బ తీసెన్!సారి సారికి వెక్కిరింపన్!
వాట మేర్చిన దోష క న్యై!పారె లోకము చిక్కి భీతిన్!
చీటి చింపును నిక్కు వంబై!తీరు మారునె?భ్రాంతి గాకన్!

అణిమా ఛందము నందలి ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-18,అక్షరము లుండును.
యతి,10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-భీతి చిక్కు"వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!తారు గమ్య మగమ్యమై!
సారి సారికి వెక్కి రింపన్!చారు శీల వికారతన్!
పారె లోకము చిక్కి భీతిన్!వారు వీరని యెంచకన్!
చేరె నక్రమ విక్రమార్కమ్!చేర జేయును కాలునిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-భ్రాంతి గను"-వృత్తము.

తారు గమ్య మగమ్యమై!దారి గోతుల నాతి చూపుల్!
చారు శీల వికారతన్!సారి సారికి వెక్కిరింపన్!
వారు వీరని యెంచకన్!పారె లోకము చిక్కి భీతిన్!
చేర జేయును కాలునిన్!చేరె నక్రమ విక్ర మార్కమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-చాటు మాటు"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!తారు గమ్య మగమ్యమై!
చాటు మాటున దెబ్బ దీసెన్!చారు శీల వికారతన్!
వాట మేర్చిన దోష కన్యై!వారు వీరని యెంచకన్!
చీటి చింపును నిక్కు వంబై!చేర జేయును కాలునిన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-చేరు"-వృత్తము.

తారు గమ్య మగమ్యమై!తాట దీసెను జీవ ధాత్రిన్!
చారు శీల వికారతన్!చాటు మాటున దెబ్బ తీసెన్!
వారు వీరని యెంచకన్!వాట మేర్చిన దోష కన్యై!
చేర జేయును కాలునిన్!చీటి చింపును నిక్కు వంబై!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-దెబ్బతీయు"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!దారి గోతుల నాతి చూపుల్!తారు గమ్య మగమ్యమై!
చాటు మాటున దెబ్బ దీసెన్!సారి సారికి వెక్కి రింపన్!చారు శీల వికారతన్!
వాట మేర్చిన దోష కన్యై!పారె లోకము చిక్కి భీతిన్!వారు వీరని యెంచకన్!
చీటి చింపును నిక్కు వంబై!చేరె నక్రమ విక్ర మార్కమ్!చేరజేయును కాలునిన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-వాట మేర్చు"-వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!తారు గమ్య మగమ్యమై!తాట దీసెను జీవధాత్రిన్!
సారి సారికి వెక్కిరింపన్!చారు శీల వికారతన్!చాటు మాటున దెబ్బ దీసెన్!
పారె లోకము చిక్కి భీతిన్!వారు వీరని యెంచకన్!వాటమేర్చిన దోషకన్యై!
చేరె నక్రమ విక్రమార్కమ్!చేర జేయును కాలునిన్!చీటి నింపును విక్ర మార్కమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.