గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2024, బుధవారం

చరిత నిల్చు,కరుణ గాచు,కరము మేలు,మేలొనరు,మరపు రాని,జరా సౌఖ్యం,గర్భ"- జరయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్. 

ధర్మ కర్ము లుదాసీనులు!ధరణి బ్రోచే సత్య సంధుల్!తరము నిల్పే ధీ నిధుల్!

మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరణ మైనా లెక్క సేయర్!మరువ నౌనే వారినిన్!
కర్మ జీవ సు కర్మంబులు!కరుణ గాచుం సర్వకాలమ్!కరము మేలౌ రక్షతన్!
చర్మ ధారులు దైవాంశులు!చరిత నిల్చే వారనంగన్!జరయు సౌఖ్యం బేర్పడున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-కర్మజీవ"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కర్మ జీవ సు కర్మంబులు!
చర్మ ధారులు దైవాంశులు!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాము నకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-మర్మ కర్మ"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!
మరణ మైనా లెక్క సేయర్!
కరుణ గాచుం సర్వ కాలమ్!
చరిత నిల్చే వారనంగన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును

3,గర్భగత"-ధర్మ కర్మ"-వృత్తము.

తరము నిల్చే ధీ నిధుల్!
మరువ నౌనే వారినిన్!
కరము మేలౌ రక్షతన్!
జరయు సౌఖ్యం బేర్పడున్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"-సత్యసంధతా"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరణ మైనా లెక్క సేయర్!
కర్మ జీవ సుకర్మంబులు!కరుణ గాచున్ సర్వ కాలమ్!
చర్మ ధారులు దైవాంశులు!చరిత నిల్చే వారనంగన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-కరుణ"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!ధర్మ కర్ము లుదాసీనులు!
మరణ మైనా లెక్క సేయర్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరుణ గాచున్ సర్వ కాలమ్!కర్మ జీవ సు కర్మంబులు!
చరిత నిల్చే వారనంగన్!చర్మ ధారులు దైవాంశులు!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-తరము"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!తరము నిల్పే ధీ నిధుల్!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరువ నౌనే వారినిన్!
కర్మజీవ సు కర్మంబులు!కరము మేలౌ రక్షతన్!
చర్మ ధారులు దైవాంశులు!జరయు సౌఖ్యం బేర్పడున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

7,గర్భగత"-మరువరాని"-వృత్తము.

తరము నిల్పే ధీ నిధుల్!ధర్మకర్ము లుదాసీనులు!
మరువ నౌనే వారినిన్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరము మేలౌ రక్షతన్!కర్మ జీవ సు కర్మంబులు!
జరయు సొఖ్యం బేర్పడున్!చర్మ ధారులు దైవాంశులు!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-తెగించు"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!తరము నిల్పే ధీ నిధుల్!
మరణమైనా లెక్క సేయర్!మరువ నౌనే వారినిన్!
కరుణ గాచుం సర్వ కాలమ్!కరము మేలౌ రక్షతన్!
చరిత నిల్చే వారనంగన్!జరయు సౌఖ్యం బేర్పడున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-చరిత నిల్చు"-వృత్తము.

తరము నిల్చే ధీనిధుల్!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మరువ నౌనే వారినిన్!మరణ మైనా లెక్క సేయర్!
కరము మేలౌ రక్షతన్!కరుణ గాచున్ సర్వకాలమ్!
జరయు సౌఖ్యం బేర్పడున్!చరిత నిల్చే వారనంగన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-కరుణగాచు"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!ధర్మ  కర్ము లుదాసీనులు!తరము నిల్పే ధీ నిధుల్!
మరణ మైనా లెక్క సేయర్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరువ నౌనే వారినిన్!
కరుణ గాచుం సర్వ కాలమ్!కర్మ జీవ సుకర్మంబులు!కరము మేలౌ రక్షతన్!
చరిత నిల్చే వారనంగన్!చర్మ ధారులు దైవాంశులు!జరయు సౌఖ్యం బేర్పడున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-కరము మేలు"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!తరము నిల్పే ధీ నిధుల్!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరువ నౌనే వారినిన్!మరణమైనా లెక్క సేయర్!
కర్మ జీవ సు కర్మంబులు!కరము మేలౌ రక్షతన్!కరుణ గాచుం సర్వ కాలమ్!
చర్మ ధారులు దైవాంశులు!జరయు సౌఖ్యం బేర్పడున్!చరిత నిల్చే వారనంగన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-మేలొనరు"-వృత్తము.

తరము నిల్చే ధీనిధుల్!ధర్మ కర్ము లుదా సీనులు!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మరువ నౌనే వారినిన్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరణమైనా లెక్క సేయర్!
కరము మేలౌ రక్షతన్!కర్మ జీవ సు కర్మంబులు!కరుణ గాచుం సర్వ కాలమ్!
జరయు సౌఖ్యం బేర్పడున్!చర్మ ధారులు దైవాంశులు!చరిత నిల్చే వారనంగన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-మరపు రాని"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!తరము నిల్పే ధీ నిధుల్!ధర్మ కర్ము లుదాసీనులు!
మరణమైనా లెక్క సేయర్!మరువ నౌనే వారినిన్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరుణ గాచుం సర్వ కాలమ్!కరము మేలౌ రక్షతన్!కర్మ జీవ సుకర్మంబులు!
చరిత నిల్చే వారనంగన్!జరయు సౌఖ్యం బేర్పడున్!చర్మ ధారులు దైవాంశులు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-జరాసౌఖ్యం"-వృత్తము.

తరము నిల్పే ధీ నిధుల్!ధరణి బ్రోచే సత్య సంధుల్!ధర్మ కర్ము లుదాసీనులు!
మరువ నౌనే వారినిన్!మరణ మైనా లెక్క సేయర్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరము మేలౌ రక్షతన్!కరుణ గాచుం సర్వకాలమ్!కర్మ జీవ సుకర్మంబులు!
జరయు సౌఖ్యం బేర్పడున్!చరిత నిల్చే వారనంగన్!చర్మ ధారులు దైవాంశులు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.