జైశ్రీరామ్.
జన్మ దుఃఖము జరా దుఃఖం!జగతి దుష్కర్మ దుఃఖం!సరగు లోకము తీరిదే!
మన్మథాశ్రిత ప్రమోదంబున్!మగువ లాంపట్యజీవమ్!మరు వరాశ్రిత చిత్తమై!
తన్మనోహరు వరాంబోధిన్!తగను కీర్తింప సౌఖ్యం!ధర వెలుంగుత భక్తినిన్!
చిన్మయంబగు ప్రశాంతంబున్!సెగలు దూరంబు సేయువ్!చిరము కీర్తులు
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృ
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.
1,గర్భగత"-జన్మదుఃఖం"-వృత్తము.
జన్మ దుఃఖము జరా దుఃఖం!
మన్మథాశ్రిత ప్రమోదంబున్!
తన్మనోహరు వరాంబోధిన్!
చిన్మయంబగు ప్రశాంతంబున్!
అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-జరాదుఃఖం"-వృత్తము.
జగతి దుష్కర్మ దుఃఖం!
మగువ లాంపట్య జీవమ్!
తగను కీర్తింప సౌఖ్యం!
సెగలు దూరంబు సేయున్!
అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
3,గర్భగత"-కర్మదుఃఖం"-వృత్తము.
సరగు లోకము తీరిదే!
మరు వరాశ్రిత చిత్తమై!
ధర వెలుంగుత భక్తినిన్!
చిరము కీర్తుల నింపుచున్!
అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-మదనాశ్రి"వృత్తము
జన్మ దుఃఖము జరా దుఃఖం!జగతి దుష్కర్మ దుఃఖం!
మన్మదాశ్రిత ప్రమోదంబున్!మగువ లాంపట్య జీవమ్!
తన్మనోహరు వరాంబోధిన్!తగను కీర్తింప సౌఖ్యమ్
చిన్మయంబగు ప్రశాంతంబున్!సెగలు దూరంబు సేయున్!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి10,.వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-ప్రశాంతతా"-వృత్తము.
జగతి దుష్కర్మ దుఃఖం!జన్మ దుఃఖము జరా దుఃఖం!
మగువ లాంపట్య జీవం!మన్మదాశ్రిత ప్రమోదంబున్!
తగను కీర్తింప సౌఖ్యం!తన్మనోహరు వరాంబోధిన్!
సెగలు దూరంబు సేయున్!చిన్మయంబగు ప్రశాంతంబున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరము నకు చెల్లును.
6,గర్భగత"-సంపారబంధ"-వృత్తము.
జన్మ దుఃఖము జరా దుఃఖం!సరగు లోకము తీరిదే!
మన్మథాశ్రిత ప్రమోదంబన్!మరు వరాశ్రిత చిత్తమై!
తన్మనోహరు వరాంబోధిన్!ధర వెలుంగుత భక్తినిన్!
చిన్మయంబగు ప్రశాంతంబున్!చిరము కీర్తులు నింపుచున్!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-కీర్తింప"-వృత్తము.
సరగు లోకము తీరిదే!జన్మ దుఃఖము జరా దఃఖమ్!
మరు వరాశ్రిత చిత్తమై!మన్మథాశ్రిత ప్రమోదంబున్!
ధర వెలుంగుత భక్తి నిన్!తన్మనోహరు వరాంబోధిన్!
చిరము కీర్తులు నింపుచున్!చిన్మయంబగు ప్రశాంతంబున్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10, వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-విరోదాబాస"-వృత్తము.
జగతి దుష్కర్మ దుఃఖం!సరగు లోకము తీరిదే!
మగువ లాంపట్య జీవం!మరు వరాశ్రిత చిత్తమై!
తగను కీర్తింప సౌఖ్యమ్!ధర వెలుంగుత భక్తినిన్!
సెగలు దూరంబు సేయున్!చిరము కీర్తులు నింపుచున్!
అణిమా ఛందము నందలి,అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును
.యతి"9,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"సుకీర్తి"-వృత్తము.
సరగు లోకము తీరిదే!జగతి జగతి దుష్కర్మ దుఃఖం!
మరు వరాశ్రిత చిత్తమై! మగువ లాంపట్య జీవమ్!
ధర వెలుంగుత భక్తినిన్!తగను కీర్తింప సౌఖ్యమౌ!
చిరము కీర్తులు నింపు చున్!సెగలు దూరంబు సేయున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-ధరవెలుగు "-వృత్తము.
జగతి దుష్కర్మదుఃఖం!జన్మదుఃఖము జరా దుఃఖః!సరగు లోకము తీరదే!
మగువ లాంపట్య జీవమ్!మన్మదాశ్రిత ప్రమోదంబున్!మరు వరాశ్రిత చిత్తడై!
తగను కీర్తిం ప సౌఖ్యం!తన్మనోహరు వరాంబోధిం!ధర వెలుంగుత భక్తినిన్!
సెగలు దూరంబు సేయున్!చిన్మయంబగు ప్రశాంతంబున్!చిరము కీర్తులు
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
11,గర్భగత"-చిరకీర్తి"-వృత్తము
జన్మదుఃఖము జరా దుఃఖం!సరగు లోకము తీరిదే!జగతి దుష్కర్మ దుఃఖమ్!
మన్మదాశ్రిత ప్రమోదంబున్!మరువరాశ్రిత చిత్తుడై!మగువలాంపట్య జీవమ్!
తన్మనోహరు వరాంబోధిన్!ధర వెలుంగుత భక్తినిన్!తగను కీర్తింప సౌఖ్యమ్!
చిన్మయంబగు ప్రశాంతంబున్! చిరము కీర్తుల నింపుచున్!సెగలు దూరంబు
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-మెలంగు"-వృత్తము.
సరగు లోకము తీరిదే!జన్మ దుఃఖము జరా దుఃఖం!జగతి దుష్కర్మ దుఃఖమ్!
మరువరాశ్రిత చిత్తుడై!మన్మదాశ్రిత ప్రమోదంబున్!మగువ లాంపట్య జీవమ్!
ధర వెలుంగుత భక్తినిన్!తన్మనోహరు వరాంబోధిన్!తగను కీర్తింప సౌఖ్యమ్!
చిరము కీర్తుల నింపుచున్!చిన్మయంబగు ప్రశాంతంబున్!సెగలు దూరంబు
అనిరుద్ఛందమునందలిఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,19,19,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-కీర్తిత"-వృత్తము.
జగతి దుష్కర్మ దుఃఖం!సరగు లోకము తీరిదే!జన్మ దుఃఖము జరా దుఃఖమ్!
మగువ లాంపట్య జీవమ్!మరు వరాశ్రితచిత్తుడై!మన్మథాశ్రిత ప్రమోదంబున్!
తగను కీర్తింప సౌఖ్యం!ధర వెలుంగుత భక్తినిం!తన్మనోహరు వరాంబోధిన్!
సెగలు దూరంబు సేయున్!చిరము కీర్తుల నింపుచున్!చిన్మయంబగు ప్ర
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరములుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-దుష్కర్మ"-వృత్తము.
సరగు లోకము తీరిదే!జగతి దుష్కర్మ దుఃఖం!జన్మ దుఃఖము జరా దుఃఖం!
మరువరాశ్రిత చిత్తుడై!మగువలాంపట్యజీవమున్!
ధర మెలుంగుత భక్తినిం! తగను కీర్తింప సౌఖ్యం!తన్మనోహరు వరాంబుధిన్!
చిరము కీర్తుల నింపుచున్!సెగలు దూరంబు సేయున్!చిన్మయంబగు
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.