జైశ్రీరామ్.
మతి భ్రమ,అశాశ్వత,జాలువారు,పాలుపంచు,తావియె,పావకుడు,కన్ను లొట్ట,గర్భ "-దీప్తి వరామ"-వృత్తము."దీప్తి వరామ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
జీవనత్వం మత్తు దేలెనే! శ్రీ వరంబులు చిందు లేయన్!శ్రీలు దొఒడ్లకు నడ్డయై!
పావనత్వం పట్టు దప్పెనే!పావకుండిల భీతిలంగన్!పాలు పంపక మాయెనే!
సావధానం గానదాయెనే!చావు దప్పియు కన్ను లొట్టై!జాలువారిన కీర్తులన్!
తావి వీడే దారముయెనే! దైవ చింతన మృగ్య మాయెన్!తైల దీప్తి వరామతన్!
పాలు=భాగము,తైల దీప్తి వరామ=నూనె కాంతుల శ్రేష్టత,(శనీశ్వర)
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృ తి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు,10,19,అక్షరములకు చెల్లును.
1,గర్భగత"-మత్తు దేలు"-వృత్తము.
జీవనత్వం మత్తు దేలెనే!
పావనత్వం పట్టు దప్పెనే!
సావధానం గాన దాయెనే!
తావి వీడే దార మాయెనే!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-పట్టు దప్పి"-వృత్తము.
శ్రీ వరంబులు చిందు లేయన్!
పావకుం డిల భీతిలంగన్!
చావు దప్పియు కన్ను లొట్టై!
దైవ చింతన మృగ్య మాయెన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
3,గర్భగత"-కాన దాయె"-వృత్తము.
శ్రీలు దొడ్లకు నడ్డయై!
పాలు పంపక మాయెనే!
జాలు వారిన కీర్తులన్!
తైల దీప్తి వరామతన్!
అభిజ్ఞా ఛంద మందలి అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
4,గర్భగత"-చిందు లేయు"-వృత్తము.
జీవనత్వం మత్తు దేలెనే!శ్రీ వరంబులు చిందు లేయన్!
పావనత్వం పట్టు దప్పెనే!పావకుండిల భీతిలంగన్!
సావధానం గాన దాయెనే!చావు దప్పియు కన్ను లొట్టై!
తావి వీడే దారమాయెనే!దైవ చింతన మృగ్య మాయెన్!
అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండు ను.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-కానరాని"-వృత్తము.
శ్రీ వరంబులు చిందు లేయన్!జీవనత్వము మత్తు దేలెనే!
పావకుం డిల భీతిలంగన్!పావనత్వము పట్టు దప్పెనే!
చావు దప్పియు కన్ను లొట్టై!సావధినం గాన దాయెనే!
దైవ చింతన మృగ్య మాయెన్!తావి వీడే దారమాయెనే!
అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-ఉదారతా"-వృత్తము.
జీవనత్వం మత్తు దేలెనే!శ్రీలు దొడ్లకు నడ్డయై!
పావనత్వం పట్టు దప్పెనే!పాలు పంపక మాయెనే!
సావధానం గాన దాయెనే!జాలు వారిన కీర్తులన్!
తావి వీడే దారమాయెనే!తైల దీప్తి వరామతన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-గత కీర్తి"-వృత్తము.
శ్రీలు దొడ్లకు నడ్డయై!జీవనత్వం మత్తు దేలెనే!
పాలు పంపక మాయెనే!పావనత్వం పట్టు దప్పెనే!
జాలు వారిన కీర్తులన్!సావధానం గాన దాయెనే!
తైల దీప్తి వరామతన్!తావి వీడే దారమాయెనే!
అణిమా ఛందము నందలి "అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-మతిభ్రమ"-వృత్తము.
శ్రీ వరంబులు చిందు లేయన్!శ్రీలు దొడ్లకు నడ్డయై!
పావకుండిల భీతిలంగన్!పాలు పంపక మాయెనే!
చావు దప్పియు కన్ను లొట్టై!జాలు వారిన కీర్తులన్!
దైవ చింతన మృగ్య మాయెన్!తైల దీప్తి వరామతన్!
అణిమా ఛందము నందలి "అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-అశాశ్వత"-వృత్తము.
శ్రిలు దొడ్లకు నడ్డయై!శ్రీ వరంబులు చిందు లేయన్!
పాలు పంపక మాయెనే!పావకుండిల భీతిలంగన్!
జాలు వారిన కీర్తులన్!చావు దప్పియు కన్ను లొట్టై!
తైల దీప్తి వరామతన్!దైవ చింతన మృగ్య మాయెన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-జాలు వారు"-వృత్తము.
శ్రీ వరంబులు చిందు లేయన్!జీవ నత్వం మత్తు దేలెనే!శ్రీలు దొడ్లకు నడ్డయై!
పావకుండిల భీతిలంగన్!పావనత్వం పట్టు దప్పెనే!పాలు పంపక మాయెనే!
చావు దప్పియు కన్ను లొట్టై!సావధానంగాన దాయెనే!జాలు వారిన కీర్తులన్!
దైవ చింతన మృగ్య మాయెన్!తావి వీడే దారమాయెన్!తైల దీప్తి వరామతన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
11,గర్భగత"-పాలుపంచు"-వృత్తము.
జీవనత్వం మత్తు దేలెనే!శ్రీలు దొడ్లకు నడ్డయై!శ్రీ వరంబులు చిందు లేయన్!
పావనత్వం పట్టు దప్పెనే!పాలు పంపక మాయెనే!పావకుండిల భీతిలంగన్!
సావధానం గాన దాయెనే!జాలు వారిన కీర్తులన్!చావు దప్పియు కన్ను లొట్టై!
తావి వీడే దార మాయెన్!తైల దీప్తి వరామతన్!దైవ చింతన మృగ్య మాయెన్!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం దము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.
12,గర్భగత"-తావియై"-వృత్తము.
శ్రీలు దొడ్లకు నడ్డయై!జీవనత్వం మత్తు దేలెనే!శ్రీ వరంబులు చిందు లేయన్!
పాలు పంపక మాయెనే!పావనత్వం పట్టు దప్పెనే!పావకుండిల భీతిలంగన్!
జాలు వారిన కీర్తులన్!సావధానం కాన దాయెన్!చావు దప్పియు కన్ను లొట్టై!
తైల దీప్తి వరామతన్!తావి వీడే దారమాయెన్!దైవ చింతన మృగ్య మాయెన్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-పావకుడు"-వృత్తము.
శ్రీ వరంబులు చిందు లేయన్!శ్రీలు దొడ్లకు నడ్డయై!జీవనత్వం మత్తు దేలెనే!
పావ కుండిల భీతి లంగన్!పాలు పంపక మాయెనే! పావనత్వం పట్టు దప్పెనే!
చావు దప్పియు కన్ను లొట్టై!జాలు వారిన కీర్తులన్!సావధానం కానదాయెనే!
దైవ చింతన మృగ్య మాయెన్!తైల దీప్తి వరామతన్!తావి వీడే దార మాయెన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-కన్ను లొట్ట"-వృత్తము.
శ్రీలు దొడ్లకు నడ్డయై!శ్రీ వరంబులు చిందు లేయన్!జీవనత్వం మత్తు దేలెనే!
పాలు పంపక మాయెనే!పావకుండిల భీతిలంగన్!పావనత్వం పట్టు దప్పెనే!
జాలు వారిన కీర్తులన్!చావు దప్పియు కన్ను లొట్టై!సావధానం కానదాయెనే!
తైల దీప్తి వరామతన్!దైవ చింతన మృగ్య మాయెనే!తావి వీడే దారమాయెన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.