గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

గావః పశ్యంతి గంధేన ..... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  గావః పశ్యంతి గంధేన  -  వేదైః పశ్యంతి పండితాః!

చారైః పశ్యంతి రాజానః  -  చక్షుభ్యాం ఇతరే జనాః!

తే.గీ.  గంధచక్షువులన్ బశుల్ కనుచునుండు,

వేదచక్షులన్ గాంతురు వేదవిదులు

చారు చక్షులన్ బాలకుల్ చక్క గాంత్రు,

చర్మ చక్షువులన్ గాంత్రు సకలజనులు.

భావము

గోవులు వాసనా నేత్రము చేతను, పండితులు వేదవిజ్ఞానమనే నేత్రము చేతను, 

రాజులు చారులనెడి (గూఢచారులు) నేత్రములతోడను, తమకు 

కావలసిన విషయములను చూచుచుండగా, సాధారణజనులు 

చర్మచక్షువులతోనే చూడగలుగుచున్నారు.

జైహింద్.

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

అద్బుతం, అద్బుతం సత్యం నిజం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంతోషం అజ్ఞాతగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.