గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, అక్టోబర్ 2023, సోమవారం

సదాచారేణ సర్వేషాం.... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో. సదాచారేణ సర్వేషాం  -  శుద్ధం భవతి మానసం!

నిర్మలం చ విశుద్ధం చ మానసం దేవమందిరమ్!!

తే.గీ.  వర సదాచారమున మదిన్ వరలు శుద్ధి,

నిర్మలంబైన శుద్ధమౌ మర్మదూర

మనసె దైవంబునకు గొప్ప మందిరంబు,

అట్టి మనసిచ్చు దైవమే పట్టుపట్ట.

భావము. సత్ప్రవర్తనతో అందరికీ మనస్సు పరిశుద్ధమౌతుంది.... 

నిర్మలము, పరిశుద్ధమూ అయిన మనస్సే దేవమందిరం. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.