జైశ్రీరామ్.
శరన్నవరాత్రులలో ఈరోజు 8వ రోజు. ఈ రోజు అమ్మ మనలో మహాదేవిగా నిండి ఉంటుంది. అట్టి మహాదేవి మనలను కాపాడుగాక.
ఓం శ్రీ మహాగౌర్యై నమః.
శ్లో. శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుచిః,
మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా.
తే.గీ. శ్వేతవృషభాధిరూఢయు, శ్వేతవస్త్ర
ధారిణియు, శుభ్రతేజయు, దాన్వారి,
శ్రీమహాదేవునకుఁ బ్రేమ చెన్నుగ నిడు,
శ్రీమహాగౌరి మనకిచ్చు చెలఁగి శుభము.
భావము. తెల్లని వృషభమును అధిరోహించినది, తెల్లని వస్త్రమును
ధరించినది, శుచిగా శోభించునది, మహాదేవునకు సంతోషమును
ప్రసాదించునట్టిది, అయిన మహాగౌరి మనకు శుభములనొసంగుగాక..
8. మహాగౌరీ మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు అని అర్థం.
పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం నారదుడు
ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి,
ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి,
అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది.
ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా
లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది.
దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది.
అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటుచేసుకుంది.
చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై, ఆమెను
వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను
తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా
తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా
ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి
అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన
తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును
సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.