గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, అక్టోబర్ 2023, సోమవారం

మహాజనస్య సంపర్క : ... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  మహాజనస్య సంపర్క : -  కస్య నోన్నతికారకః ౹

పద్మపాత్రస్థితం తోయం  -  ధత్తే ముక్తాఫల శ్రియమ్ ౹౹ 

తే.గీ.  మాన్య జనుల సంపర్కమ్ము మహిత గతిని

యీయకుండగ నెట్లుండు? జ్ఞేయముగను, 

పర్మపత్ర పాత్రంబుపై పడిన నీటి

బిందువది మౌక్తిక ప్రభ పొందకున్నె?

భావము.  మహావ్యక్తుల సంబంధం ఎవరికైనా కానీ తానే ప్రసిద్ధిని ఇవ్వకుండా 

ఉండగలదా?అలాగే,పద్మపత్ర అంటే తామరాకు మీద ఉన్నా నీటిబొట్టు 

ముత్యంలా ప్రకాశిస్తుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.