జైశ్రీరామ్.
శ్లో. యథాన్నం మధుసంయుక్తం - మధువాన్యేన సంయుతం ౹
ఏవం తపశ్చ విద్యా చ సంయుక్తం - భేషజం మహత్ ౹౹
తే.గీ. అన్నమందున చేరిన నన్యమందు
చేరినన్ మధు వౌషధ మై రహించు,
నటులె విద్యయున్ దపము నొకటిగనైన
మంగళప్రదమగునది మందువోలె.
భావము.
అన్నంతో మధు చేరినా, లేక మధువే వేరే దేనిలో చేరినా అది ఔషధము
అయిన విధముగనే, విద్య, తపస్సు ఒక్కటి అయినపుడు అన్ని విధములుగనూ
అది మంగళప్రదముగనే ఉంటుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.