జైశ్రీరామ్.
శ్లో. నిష్ణాతోsపి చ వేదాంతే - సాధుత్వం నైతిదుర్జనః
చిరం జలనిధౌ మగ్న : - మైనాక ఇవమార్దవమ్.
తే.గీ. వేదశాస్త్రాదులందు తా వేత్తయగుత
దుష్టుఁడేవిధంబుగనైన శిష్టుఁడగునె?
చాలకాలము మునిగినన్ సంద్రమందు
మృదువగునొకొ మైనాకుఁడు? మృదుల హృదయ!
భావము.
వేదాంత శాస్త్రాలలో ఎంత నిపుణుఁడైనా చెడ్డ స్వభావమున్నవాడు
మంచివాడుకాలేడు. చాలా కాలం నుంచి సముద్రంలో మునిగినా
మైనాక పర్వతం మృదువుగా అవదుకదా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.