జైశ్రీరామ్
ఆగమగతి,అపసృతి,ఆగత,పటువిడు,వీ
"- అనాగత"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!అనాగతము నాగతమ్!యనుకొన దగదెన్నడున్
సాగెద నామాట నాదని!జనానుమతమారయన్!జనవలె తగినట్టులన్!
నీగతి మూర్ఖత వీడుమ!నీనామము సార్ధకమౌ!నినదము సరియౌనులే!
భోగము సార్ధక మందును!పోనాడకు సు శోభలన్!పునరపిచెడుగౌనులే!
సృజనాత్మక గర్భకవితా ఛందమునందలిఅనిరుద్ఛందాంతర్గతఉత్
ఛందములోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు26అక్షరము
లుండును,10,19,అక్షరములకు యతులు చెల్లును.
1.గర్భగత"-గతిగమన"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!
సాగెద నామాట నాదని!
నీగతి మూర్ఖత వీడుమ!
భోగము సార్ధక మందును!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందములోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు9,అక్షరములుండును.
2,గర్భగత"-అనుమతా"-వృత్తము.
అనాగతము నాగతమ్!
జనానుమత మారయన్
నీనామము సార్ధకమౌ!
పోనాడకు సు శోభల్!
అభిజ్ఞా ఛందమునందలి అనుష్టుప్"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు8,అక్షరములుండును.
3.గర్భగత"-నినద"-వృత్తము.
యనుకొన దగ దెన్డున్!
జనవలె తగినట్టులన్!
నినదము సరియౌనులే!
పునరపి చెడుగౌనులే!
అభిజ్ఞాఛందమునందలి బృహతీఛందములోవది.
ప్రాసనియమము కలదు.పాదమునకు9,అక్షరములుండును.
4,గర్భగత"-బోనాల వృత్తము.
ఆగమమేగతి నేగిన!అనాగతము నాగతమ్!
సాగెద నామాట నాదని!జనానుమత మారణన్!
నీగత మూర్ఖము వీడుమ!నీనామము సార్ధకమౌ!
భోగము సార్ధక మందును!పోనాడకు సుశోభల్!
అణిమా ఛందమునందలి అత్యష్టి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును
10,వ యక్షరముతో యతి చెల్లును.
5.గర్భగత"-పూనిక"-వృత్తము.
అనాగతము నాగతమే!యనుకొన దగదెందున్!
జానుమతమారయన్!జనవలె తగి నట్టులన్!
నీనామము సార్ధకమౌ!నినదము సరి యౌనులే!
పోనాడకు సు శోభల్!పునరపి చెడుగౌనులే!
అణిమాఛందమునందలిఅత్యష్టి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును
యతి10,వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-బుద్బుధసమ"-వృత్తము.
యనుకొన దగ దెందున్!ఆగమ మేగతి నేగిన!
జనవలె దగి నట్టులన్!సాగెద నామాట నాదని!
నినదము సరి యౌనులే!నీగత మూర్ఖము వీడుమ!
పునరపి చెడుగౌనులే!భోగము సార్ధక మందున్!
అణిమా ఛందమునందలి ధృతిఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును
యతి10,వయక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-కడజను"-వృత్తము.
యనుకొన దగ దెందున్!అనాగతము నాగతమే!
జనవలె దగనట్టులన్!జనానుమత మారయన్!
నినదము సరియౌనులే!నీనామము సార్ధకమౌ!
పునరపి చెడు గౌనులే!పోనాడకు సు శోభల్!
అణిమా ఛందమునందలి "-ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమభు కలదు.పాదమునకు18 అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-ఆగమగతి"-వృత్తము.
అనాగతము నాగతమే!ఆగమ మేగతి నేగిన!
జనాను మత మారయన్!సాగెద నామాట నాదని!
నీనామము సార్ధకమౌ!నీగత మూర్ఖము వీడుమ!
పోనాడకు సు శోభల్!భోగము సార్ధకమందున్!
అణిమా ఛందములందలి"-ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 18,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-అపసృతి"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!అనాగతము నా గతమే!
సాగెద నామాట నాదని!జనానుమత మారయన్!
నీగత మూర్ఖము వీడుమ!నీ నామము సార్ధకమౌ-
భోగము సార్ధక మందున్!పోనాడకు సు శోభల్!
10,గర్భగత"-ఆగత"-వృత్తము.
అనాగతము నాగతమే!యనుకొనదగ దెందున్!ఆగమ మేగతి నేగిన!
జనానుమత మారయన్!జనవలె దగినట్టులన్!సాగెద నామాట నాదని!
నీ నామము సార్ధకమౌ!నినదము సరి యౌనులే!నీగత మూర్ఖము వీడుమ!
పో నాడకు సు శోభల్!పునరపి చెడుగౌనులే!భోగము సార్ధక మందున్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము లుండును.
10;18,అకషరములకు యతులు చెల్లును.
11.గర్భగత"-పటువిడు"-వృత్తము.
యనుకొనదగ దెందు!ఆగమ మేగతి నేగిన!అనాగతుము నాగతమే!
జనవలె దగినట్టులన్!సాగెద నామాట నాదని!జనానుమత మారయన్!
నినదము సరియౌనులే!నీగత మూర్ఖము వీడుమ!నీనామము సార్ధకమౌ!
పునరపి చెడుగౌనులే!భోగము సార్ధక మందున్!పోనాడకు సు శోభల్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది,
ప్రాస నియమము కలదు .పాదమనకు26,క్షరములుండును.
10,19,అక్షరములకు యతులు చెల్లును.
12,గర్భగత"-వీడని"-వృత్తము.
యనుకొన దగదెందు!అనాగతము నాగతమే!ఆగమ మేగతి నేగిన!
జనవలె దగి నట్టలన్!జనానుమత మారయన్!సాగెద నామాట నాదని!
నినదము సరి యౌనులే!నీనామము సార్ధకమౌ!నీగత మూర్ఖము వీడుమ!
పునరపి చెడుగౌనులే!పో నాడకు సు శోభల్!భోగము సార్ధక మందున్!
అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది!
ప్రాసనియమము కలదు .పాదమునకు 26 అక్షరములుండును.
9,18,అక్షరములకు యతులు చెల్లును.
13,గర్భగత"-గమన"-వృత్తము.
అనాగతము నాగతమే!ఆగమమేగతి నేగిన!యనుకొన దగ దెందు!
జనానుమతమారయన్!సాగెద నామాట నాదని!జనవలె దగినట్టులన్!
నీనామము సార్ధకమౌ!నీ గత మూర్ఖము వీడుమ!నినదము సరియౌనులే!
పోనాడకు సుశోభల్!భోగము సార్ధక మంచున్!పునరపి చెడుగౌనులే!
అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమముకలదు.పాదమునకు 26,అక్షరములుండును.
10,19,అక్షరములకు యతులు చెల్లును.
14.గర్భగత "-తెగుత"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!యనుకొన దగ దెందు!అనాగతము నాగతమే!
సాగెద నామాట నాదని!జనవలె దగి నట్టులన్!జనానుమత మారయన్!
నీ గత మూర్ఖము వీఢుమ!నినదము సరి యౌనులే !నీనామము సార్ధకమౌ!
భోగము సార్ధక మందున్!పునరపి చెడుగౌనులే!పోనాడకు సుశోభల్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము
లుండును.10,18అక్షరములకు యతి చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.