జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శరన్నవరాత్రులలో నాలుగవరోజు మన హృదయములొ నెలకొనియుండు తల్లి
కూష్మాండదిర్గ. ఈ తల్లి మీకెల్లప్పుడూ రక్షణగా ఉండుగాక.
శ్రీ కూష్మాండదుర్గాయై నమః
"కు" అనగా చిన్న, "ఊష్మ" అనగా ఉష్ణశక్తి, "అండా" అనగా విశ్వము.
తన చిన్న ప్రతాపముతో అనగా అతిసూక్ష్మ శక్తితో ఈ విశ్వమును సృష్టించిన
జనని కూష్మాండ దుర్గ.
శ్లో. ‘‘సురా సంపూర్ణకలశం రుధిరాఫ్లుతమేవ చ’’
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే’’
తే.గీ. రుధిర సురపూర్ణ కలశముల్ ప్రథితముగను
రెండు చేతులన్ దాల్చిన శ్రీకరమగు
దివ్య కూష్మాండజనయుత్రి దీవనలిడి
మనను రక్షించుగాత సన్మార్గమునిడి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.