జైశ్రీరామ్.
ఓం చంద్రఘంటా యైనమః.
శ్లో. పిండజ ప్రవరారూఢా - చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యాం - చంద్రఘంటేతి విశ్రుతా.
ఉ. శంభుని యాత్మవై స్వజన శంకలఁ బాపగ చంద్రఘంటవై
శుంభ నిశుంభులన్ దునిమి, శోభిల పిండజముఖ్యునెక్కి, యో
శాంభవి! భీకరాస్త్రవుగ? సన్నుతిఁ జేసెద చండకోపి! నిన్,
దంభము వాపి నన్ నిలిపి దారిని జూపుము ముక్తినొందగన్.
భావము. చండ కోపివైన ఓ చంద్రఘంటా! పరమేశ్వరునకు అత్యంత
ప్రీతిపాత్రవై, మీ వివాహ సమయములో రుద్రగణములఁ గూడి వచ్చిన
శివుని చూచి భీతిల్లుచున్న నీ బంధువుల భయము పోగొట్టుటకు
నీవు చంద్రఘంటగా మారి శంభునివేషభాషలను మార్పించి
అందరి భయమును పోగొట్టితివి. నీవు పిండజముఖ్యునధిరోహించి
చేతులలో భయంకరమయిన అస్త్రములను దాల్చి శుంభనిశుంభులను
సంహరించితివి. అట్టి నిన్ను సన్నుతి చేసెదను. నాలోని
దంభమును పోఁగొట్టి, నాకు ముక్తిమార్గమును చూపుమమ్మా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.