జైశ్రీరామ్.
రసాద్వయ,చేష్టితా,గత్యధీన,నిత్యాద్వయ ,రత్నాంబుధీ. ద్వయ, రసయాద్వయ,రసయాద్విరతా,గర్భ"-రసయారత మజా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-రసయా రతమజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.త.మ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పంతు పట్టిన గ్రామసింహమ్?పల్లె నేలే!యోగమబ్బన్?పాచి మేయక
మాను నొక్కో?
గంతు!నైజపు చైదమొప్పన్?గల్లెలందున్!సంచరించున్!కాచినా సరె!
దారి తప్పున్?
పంత మెంచని జన్మ తీరై!వల్లె దుర్గంథంపు మేనున్?పాచకంబుల
మెక్క నెంచున్!
సంతసంబదె?యెంచి చూడన్!చల్ల కుండల్చిల్లు జేయున్?సా
చరత్వము!నాశమేర్చున్?
అర్ధములు:-
గ్రామ సింహము=శునకము,పాచి మేయును=చెత్త తినును,గల్లె=
గ్రామ వీధులు,కాచినా సరె?=కాపలా కాసినను,పాచకంబులు=
వంటలు,దుర్గంథపు మేను=సహజ సిద్ధముగా చెడు వాసన గల,
శరీరము.పంత మెంచని=పట్టింపు లేని,సా చరత్వము=అట్టిదానితో
కలిసి జీవించడము,గంతు=దుముకు,
1.గర్భగత"-రస ద్వయ "-వృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
1.పంతు పట్టిన గ్రామ సింహమ్? 2. పాచి మేయక మాను నొక్కో?
గంతు నైజపు చైద మొప్పన్? కాచినా సరె?దారి తప్న్పున్!
పంత మెంచని జన్మ తీరై? పాచకంబుల మెక్క నెంచున్?
సంతసం బదె?యెంచి చూడన్! సా చరత్వము నాశ మేర్చున్?
2.గర్భగత"-చేష్టితా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.త.గగ.గణములు.వృ.సం.35.
ప్రాసనియమము కలదు.
పల్లె నేలే?యోగ మబ్బన్!
గల్లె లందున్సంచరించున్?
వల్లె దుర్గంధంపు మేనున్?
చల్ల కుండల్చిల్లు జేయున్?
3.గర్భగత"-గత్యధీన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పంతు పట్టిన గ్రామ సింహమ్?పల్లె నేలే!యోగ మబ్బన్?
గంతు నైజపు చైద మొప్పన్?గల్లె లందున్సంచరించున్?
పంత మెంచని జన్మ తీరై?వల్లె దుర్గంధంపు మేనున్?
సంతసంబదె?యెంచి చూడన్?చల్ల కుండల్చిల్లు జేయున్?
4.గర్భగత"-నిత్యా ద్వయ "-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.త.మ.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
పల్లె నేలే?యోగ మబ్బన్!పాచి మేయక!మానునొక్కో?
గల్లె లందున్సంచరించున్?కాచినా సరె!దారి తప్పున్?
వల్లె దుర్గంథంపు మేనున్?పాచకంబుల!మెక్క నెంచున్?
చల్లకుండల్చిల్లు జేయున్?సా చరత్వము నాశ మేర్చున్?
2.
పల్లె నేలే?యోగ మబ్బన్!పంతు పట్టిన గ్రామ సింహమ్?
గల్లె లందున్సంచరించున్గంతు నైజపు చైద మొప్పన్?
వల్లె దుర్గంథంపు మేనున్? పంత మెంచని జన్మ తీరై?
చల్ల కుండల్చిల్లు జేయున్? సంతసంబె?యెంచి చూడన్?
5.గర్భగత"-రత్నాంబుధీ ద్వయ"-వృత్తములు.
ఉత్రకృతిఛందము.త.మ.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
పల్లె నేలే!యోగమబ్బన్!పంతు పట్టిన గ్రామసింహమ్!పాచి మేయక
మాను నొక్కో?
గల్లె లందున్సంచరించున్?గంతు నైజపు చైదమొప్పన్?కాచినా సరె?
దారి తప్పున్?
వల్లె దుర్గంథంపు మేనున్?పంతమెంచని జన్మ తీరై,?పాచకంబుల
మెక్క నెంచున్?
చల్ల కుండల్చిల్లు జేయున్?సంతసంబె?యెంచి చూడన్?సాచరత్వము
నాశ మేర్చున్?
2,
పల్లె నేలే!యోగ మబ్బన్?పాచి మేయక మాను నొక్కో?పంతు పట్టిన
గ్రామ సింహమ్?
గల్లె లందున్సంచరించున్?కాచినా సరె?దారి తప్పున్?గంతు నైజపు
చైదమొప్పన్?
వల్లె దుర్గంధంపు మేనున్? పాచకంబుల మెక్క జూచున్?పంత
మెంచని జన్మ తీరై?
చల్లకుండలు చిల్లు జేయున్?సాచరత్వము నాశ మేర్చున్?సంతసంబె?
యెంచి చూడన్!
6.గర్భగత"-రసయాద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాచి మేయక!మాను నొక్కో?పంతు పట్టిన గ్రామ సింహమ్?
కాచినా సరె?దారి తప్పున్!గంతు నైజపు చైద మొప్పన్?
పాచకంబుల!మెక్క నెంచున్?పంత మెంచని జన్మ తీరై!
సా చరత్వము!నాశ మేర్చున్?సంతసంబదె?యెంచి చూడన్?
7..గర్భగత"రసయా ద్విరతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.త.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాచి మేయక మాను నొక్కో?పంతు పట్టిన గ్రామ సింహమ్?పల్లె నేలే
యోగ మబ్బన్?
కాచినా సరె?దారి తప్పున్!గంతు నైజపు చైద మొప్పన్?గల్లె లందున్
సంచరించున్!
పాచకంబుల మెక్క నెంచున్?పంత మెంచని జన్మ తీరై!వల్లె దుర్గంథంపు
మేనున్?
సా చరత్వము నాశ మేర్చున్?సంతసంబదె?యెంచి చూడన్!చల్ల
కుండలు చిల్లు జేయున్?
జైహింద్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.