గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2020, శనివారం

రస,మృదుమానస,భద్రకా,రసాయినా,వేనలి,కనని,తేలెనే,తివ్రతా,భీతచేతనా,రసజ్ఞ,గర్భ"-ధనమోహకా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
రస,మృదుమానస,భద్రకా,రసాయినా,వేనలి,కనని,తేలెనే,తివ్రతా,భీతచేతనా,రసజ్ఞ,గర్భ"-ధనమోహకా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
                         
   "-ధనమోహకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.మ.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళ గంతల ధర్మ మాతా!కాలె సత్యము కట్టెలన్!కాని గణాంకాల మాయలన్!
కళ్ళకావర తీవ్ర రోగమ్!గాలి తీవ్రత దుష్కృతిన్!కాన వశంబౌనె?ధర్మమున్!
తృళ్ళుచుండిరి స్వేచ్ఛయంచున్?తేలిపోయెను విశ్వమే!దీన జనంబే గతిం జనున్?
వెళ్ళె నీతి వికారి యౌచున్?వేల నొందెడి చింతనన్!వేనలిచేజిక్కె నైచ్యులన్!

అర్ధములు:-
వేలనొందెడి=వేల సంఖ్యలో ధనము పొందెడి,వేనలి=జుట్టు,చేజిక్కె
నైచ్యులన్=నీచుల చేతికి జిక్కెను,తేలిపోయెను=పైకెగసెను,
1.గర్భగత"-రస"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
కళ్ళ గంతల ధర్మ మాతా!
కళ్ళకావర తీవ్ర రోగమ్!
తృళ్ళు చుండిరి స్వేచ్ఛ యంచున్?
వెళ్ళె నీతి వికారి యౌచున్?
2.గర్భగత"-మృదు మానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
కాలె సత్యము కట్టెలన్!
గాలి తీవ్రత దుష్కృతిన్!
తేలి పోయెను విశ్వమే?
వేల నొందెడి చింతనన్!
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
కాని గణాంకాల మాయలన్!
కాన వశంబౌనె?ధర్మమున్!
దీన జనం బేగతిన్?జనున్!
వేనలి చే జిక్కె నైచ్యులన్!
4.గర్భగత"-రసాయన"-వృత్తము.
అత్యష్టీఛందముర.స.య,స.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళ గంతల ధర్మ మాతా!కాలె సత్యము కట్టెలన్!
కళ్ళ కావర తీవ్ర రోగమ్!గాలి తీవ్రత దుష్కృతిన్?
తృళ్ళు చుండిరి స్వేచ్ఛ యంచున్?తేలి పోయెను విశ్వమే!
వెళ్ళె నీతి వికారి యౌచున్?వేల నొందెడి చింతనన్!
5.గర్భగత"-వేనలి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలె సత్యము కట్టెలన్!కాని గణాంకాల మాయలన్!
గాలి తీవ్రత దుష్కృతిన్!కాన వశంబౌనె?ధర్మమున్!
తేలి పోయెను విశ్వమే?ధీన జనంబేగతిం జనున్?
వేల నొందెడి చింతనన్!వేనలి చేజిక్కె నైచ్యులన్!
6.గర్భగత"-కనని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.స.ర.య.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలె సత్యము కట్టెలన్!కాని గణాంకాల మాయలన్!కళ్ళ గంతల ధర్మమాతా!
గాలి తీవ్రత దుష్కృతిన్!కాన వశంబౌనె?ధర్మమున్!కళ్ళ కావర తీవ్ర రోగమ్!
తేలిపోయెను విశ్వమే!దీన జనంబేగతిన్?జనున్!తృళ్ళు చుండిరి స్వేచ్ఛ యంచున్?
వేల నొందెడి చింతనన్!వేనలి చేజిక్కె!నైచ్యులన్!వెళ్ళె నీతి వికారి యౌచున్?
7.గర్భగత"-తేలెనే"-వృత్తమై.
ధృతిఛందము.భ.త.ర.ర.స.య.గణములు.యతి 10,వ.యక్షరము.
ప్రాసనియు కలదు.వృ.సం.
కాని గణాంకాల మాయలన్!కళ్ళగంతల ధర్మ మాతా!
కాన వశంబౌనె?ధర్మమున్!కళ్ళకావర తీవ్ర రోగమ్!
దీన జనంబేగతిం జనున్?తృళ్ళు చుండిరి స్వేచ్ఛ యంచున్?
వేనలి చేజిక్కె నైచ్యులన్!వెళ్ళె నీతి వికారి యౌచున్?
8.గర్భగత"-తీవ్రతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.ర.స.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాని గణాంకాల మాయలన్!కళ్ళగంతల ధర్మ మాతా!కాలె సత్యము కట్టెలన్!
కాన వశంబౌనె?ధర్మమున్!కళ్ళకావర తీవ్ర రోగమ్!గాలి తీవ్రత దుష్కృతిన్?
దీన జనంబే గతింజనున్? తృళ్ళు చుండిరి స్వేచ్ఛ యంచున్?తేలి పోయెను లోకమే?
వేనలి చేజిక్కె నైచ్యులన్!వెళ్ళె నీతి వికారి యౌచున్?వేల నొందెడి చింతనన్!
9.గర్భగత"-భీత చేతనా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలె సత్యము కట్టెలన్?కళ్ళ గంతల ధర్మ మాతా!
గాలి తీవ్రత దుష్కృతిన్?కళ్ళకావర తీవ్ర రోగమ్!
తేలిపోయెను లోకమే?తృళ్ళు చుండిరి స్వేచ్ఛ యంచున్?
వేల నొందెడి చింతనన్!వేళ్ళె నీతి వికారి యౌచున్?
10,గర్భగత"-రసజ్ఞ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.మ.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలె సత్యము కట్టెలన్?కళ్ళగంతల ధర్మ మాతా!కాని గణాంకాల మాయలన్!
గాలి తీవ్రత దుష్కృతిన్?కళ్ళకావర తీవ్ర రోగమ్!కాన వశంబౌనె?ధర్మమున్!
తేలి పోయెను లోకమే?తృళ్ళు చుండిరి స్వేచ్ఛయంచున్?దీన జనంబే గతిం జనున్?
వేల నొందెడి చింతనన్!వెళ్ళె నీతి వికారి యౌచున్?వేనలి చేజిక్కె నైచ్యులన్!
స్వస్తి.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.