గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2020, శనివారం

మత్తరజినీ,ఆత్మజ్ఞాన,నరసా,సత్వరా,సత్వనీ,దురితదూర,దోషచింతా,కృపామయ,మంచినా,దయాలవాల,గర్భ"-మేల్గూర్చు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
మత్తరజినీ,ఆత్మజ్ఞాన,నరసా,సత్వరా,సత్వనీ,దురితదూర,దోషచింతా,కృపామయ,మంచినా,దయాలవాల,గర్భ"-మేల్గూర్చు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                           జుత్తాడ.
"-మేల్గూర్చు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.త.త.స.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాప కర్మ నిండె!లోకమున్!పరమాత్మా గూర్చు మేలున్!వర దయాలవాల హరీ!
నీ పయిం!కృపేమి లేదిలన్!నిరతం స్వార్థంబు పెచ్చెన్!నిరుపయోగి బీద యయెన్!
చాప క్రింద నీరు తీరయెన్?చరితెల్లం!మారి పోయెన్!సరగె స్వార్థచింత భువిన్!
దోపిడీల చేత నల్గుచున్!దురితానం!కీర్తి మాసెన్!దురిత దూర కావు మమున్!
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
పాపకర్మ నిండె!లోకమున్!
నీపయిం కృపేమి లేదయెన్?
చాపక్రింద నీరు తీరయెన్?
దోపిడీల చేత నల్గుచున్!
2.గర్భగత"-ఆత్మజ్ఞాన"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.త.గగ.గణములు.వృ.సం.36.
ప్రాస నియమము గలదు.
పరమాత్మా!గూర్చు మేలున్!
నిరతం స్వార్ధంబు!పెచ్చెన్!
చరి తెల్లన్ మారి పోయెన్!
దురితానం!కీర్తి మాసెన్!
3.గర్భగత"-నరసా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.స.గణములు.వృ.సం.216.
ప్రాసనియమము కలదు.
వర దయాలవాల హరీ!
నిరుపయోగి బీదయయెన్!
సరగె స్వార్థ చింత భువిన్!
దురిత దూర గావు మమున్!
4.గర్భగత"-సత్వరా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాప కర్మ నిండె లోకమున్!పరమాత్మా గూర్చు మేలున్!
నీపయిం కృపేమి లేదయెన్!నిరతం స్వార్ధంబు పెచ్చెన్!
చాపక్రింద నీరు తీరయెన్!చరితెల్లం మారిపోయెన్!
దోపిడీల చేత నల్గుచున్?దురితానం కీర్తి మాసెన్!
5.గర్భగత"-సత్వనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.త.స.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!గూర్చు మేలున్!వరదయాలవాల హరీ!
నిరతం స్వార్థంబు పెచ్చెన్!నిరుపయోగి బీద యయెన్!
చరి తెల్లం మారిపోయెన్!సరగె స్వార్థ చింత భువిన్!
దురితానం కీర్తి మాసెన్!దురిత దూర గావు మమున్!
6.గర్భగత"-దురిత దూర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.త.స.జ.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!గూర్చు మేలున్!వరదయాలవాల హరీ!పాపకర్మ నిండె లోకమున్!
నిరతం స్వార్థంబు పెచ్చెన్!నిరుపయోగి బీద యయెన్!నీపయిం కృపేమి లేదయెన్?
చరితెల్లం మారి పోయెం!సరగె స్వార్థ చింత భువిన్!చాపక్రింద నీరు తీరయెన్?
దురితానం!కీర్తి మాసెం!దురిత దూర గావు మమున్!దోపిడీల చేత నల్గుచున్!
7.గర్భగత"-దోషచింతా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.స.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వర దయాలవాల హరీ!పాపకర్మ నిండె లోకమున్!
నిరుప యోగి బీద యయెన్!నీపయిం!కృపేమి లేదయెన్?
సరగె స్వార్థచింత భువిన్!చాపక్రింద నీరు తీరయెన్?
దురితదూర గావు మమున్!దోపిడీల చేత నల్గుచున్!
8.గర్భగత"-కృపామయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.స.ర.జ.ర.స.త.గగ.గణములు.యతులు10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వరదయాలవాల హరీ!పాపకర్మ నిండె లోకమున్!పరమాత్మా!గూర్చు మేలున్!
నిరుపయోగి బీదయయెన్!నీపయిం కృపేమి లేదయెన్?నిరతం స్వార్థంబు పెచ్చెన్!
సరగె స్వార్థ చింత భువిన్!చాప క్రింద నీరు తీరయెన్?చరి తెల్లం మారి పోయెన్!
దురిత దూర గావు మమున్!దోపిడీల చేత నల్గుచున్!దురితాననం కీర్తి మాసెన్!
9.గర్భగత"-మంచినీ"-వృత్తము.
అత్సయష్టీఛందము.త.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా గూర్చు మేలున్!పాపకర్మ నిండె లోకమున్!
నిరతం స్వార్థంబు పెచ్చెన్!నీపయిం కృపేమి లేదయెన్?
చరి తెల్లం మారి పోయెన్!చాప క్రింద నీరు తీరయెన్!
దురితానన్!కీర్తి మాసెన్!దోపిడీల చేత నల్గుచున్!
10,గర్భగత"-మంచిని"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.మ.జ.ర.జ.స.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరమాత్మా!గూర్చు మేలున్!పాప కర్మ నిండె లోకమ్!వరదయాలవాల హరీ!
నిరతం స్వార్ధంబు పెచ్చెన్!నీపయిం కృపేమి లేదయెన్?నిరుపయోగి బీద యయెన్?
చరితెల్లం!మారిపోయెన్!చాప క్రింద నీరు తీరయెన్?సరగె స్వార్థ చింత భువిన్!
దురితానం!కీర్తి మాసెన్!దోపిడీల చేత నల్గుచున్!దురిత దూర గావు మమున్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.