మత్తరజినీ,సమానీ,నరసా,రజోరజ,సఖ్యతా,సచ్ఛర,దోషచింతా,దప్పర,మింటినంటు,కుటిలాలక, గర్భ"-ధర్మంచరా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,జుత్తాడ.
"-ధర్మం చరా వృత్తము.
ఉత్కృతిఛందము;-ర.జ.ర.ర.జ.జ.స.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గొప్ప దప్పరంబు లేలనో?కూల జేసె!సూక్ష్మ క్రిమే!కుటిల చింత దోషమనన్?
తప్పు నొప్ప దందు వేలయా?తాళ లేవు!దివ్యులకున్?తటము నెంచ తెల్వరివా?
చెప్పె దేల?నీతి వాక్యముల్?చీలనీకు!సత్య మిలన్!చిటికె పట్టు!చావు నకున్?
కప్ప గెంతు లాట మానుమా!కాల వహ్ని కాల్చు చెడున్!కటు తదేల?ధర్మ చరా!
అర్ధములు;-కుటిల చింత=దుర్మార్గపు టాలోచన,తటము=దిగంతము,
చిటికె లోన=క్షణములోన,తాళ లేవు=నిల్వరించ జాలవు,
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
గొప్ప దప్పరంబు లేలనో?
తప్పు నొప్ప దందు వేలయా?
చెప్పెదేల? నీతి వాక్యముల్!
కప్పగెంతు లాట మానుమా!
2.గర్భగత"-సమానీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.లగ.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
కూల జేసె!సూక్ష్మ క్రిమే!
తాళ లేవు?దివ్యులకున్!
చీల నీకు!సత్య మిలన్?
కాల వహ్ని కాల్చు చెడున్!
3.గర్భగత"-నరసా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.స.గణములు.వృ.సం.216.
ప్రాసనియమము కలదు.
కుటిల చింత దోష మనన్?
తటము నెంచ తెల్వరివా?
చిటికె పట్టు చావునకున్!
కటు తదేల?ధర్మ చరా!
4.గర్భగత"-రజోరజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గొప్ప దప్పరంబు లేలనో?కూల జేసె!సూక్ష్మ క్రిమే?
తప్పు నొప్ప దందు వేలయా?తాళ లేవు!దివ్యులకున్?
చెప్పెదేల?నీతి వాక్యముల్!చీలనీకు!సత్యమిలన్?
కప్ప గెంతు లాట మానుమా!కాల వహ్ని కాల్చు చెడున్?
5.గర్భగత"-సఖ్యతా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.జ.స.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కూల జేసె!సూక్ష్మ క్రిమే!కుటిల చింత దోష మనన్?
తాళ లేవు?దివ్యులకున్!తటము నెంచ తెల్వరివా?
చీల నీకు!సత్య మిలన్?చిటికె పట్టు చావునకున్?
కాల వహ్ని కాల్చు!చెడున్!కటు తదేల?ధర్మ చరా!
6.గర్భగత"-సచ్ఛరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.జ.స.జ.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కూల జేసె!సూక్ష్మ క్రిమే?కుటిల చింత దోష మనన్?గొప్ప దప్పరంబు లేలనో?
తాళలేవు?దివ్యులకున్!తటము నెంచ తెల్వరివా?తప్పు నొప్ప దందు వేలయా?
చీలనీకు!సత్యమిలన్?చిటికె పట్టు చావునకున్?చెప్పెదేల?నీతి వాక్యముల్!
కాల వహ్ని కాల్చు చెడున్!కటు తదేల? ధర్మ చరా!కప్ప గెంతు లాట మానుమా!
7.గర్భగత"-దోష చింతా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.స.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుటిల చింత దోషమనన్?గొప్ప దప్పరంబు లేలనో?
తటము నెంచ తెల్వరివా?తప్పు నొప్ప దందు వేలయా?
చిటికె పట్టు చావునకున్?చెప్పెదేల?నీతివాక్యముల్!
కటు తదేల?ధర్మ చరా!కప్ప గెంతులాట మానుమా!
8.గర్భగత"-దప్పర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.స.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుటిల చింత దోషమనన్?గొప్ప దప్పరంబు లేలనో?కూల జేసె!సూక్ష్మ క్రిమే?
తటము నెంచ తెల్వరివా?తప్పు నొప్ప దందు వేలయా?తాళ లేవు! దివ్యులకున్?
చిటికె పట్టు చావునకున్?చెప్పె దేల?నీతి వాక్యముల్!చీలనీకు సత్య మిలన్?
కటు తదేల?ధర్మ చరా!కప్ప గెంతు లాట మానుమా!కాల వహ్ని కాల్చు చెడున్!
9,గర్భగత"-మిన్నంటు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కూల జేసె!సూక్ష్మ క్రిమే!గొప్ప దప్పరంబు లేలనో?
తాళ లేవు!దివ్యులకున్?తప్పు నొప్ప దందు వేలయా?
చీల నీకు!సత్యమిలన్?చెప్పె దేల?నీతి వాక్యముల్!
కాల వహ్ని కాల్చు చెడున్!కప్ప గెంతు లాట మానుమా?
10,గర్భగత"-కుటిలతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.య.జ.ర.జ.స.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కూల జేసె!సూక్ష్మ క్రిమే!గొప్ప దప్పరంబు లేలనో?కుటిల చింత దోష మనన్?
తాళ లేవు?దివ్యులకున్!తప్పు నొప్ప దందు వేలయా?తటము నెంచ తెల్వరివా?
చీల నీకు!సత్య మిలన్?చెప్పె దేల?నీతి వాక్యముల్!చిటికె పట్టు చావునకున్?
కాల వహ్ని కాల్చు చెడున్!కప్ప గెంతు లాట మానుమా?కటు తదేల? ధర్మ చరా!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.