గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2020, బుధవారం

జరాశ్రి,కలివర,భద్రకా,నిల్కడ,సత్వర,సత్వరాశ్రి,నెఱకాడు,కరవేల,ఆగ్రహ,యదార్థతా,గర్భ"-కీర్తినింపు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
జరాశ్రి,కలివర,భద్రకా,నిల్కడ,సత్వర,సత్వరాశ్రి,నెఱకాడు,కరవేల,ఆగ్రహ,యదార్థతా,గర్భ"-కీర్తినింపు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-కీర్తినింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.స.ర.త.రస.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
యదార్థ మెంతొ?చేదు కదా!హరుడైనా!నాగ్రహించు!యాదుకొనున్!నీతి యొక్కటే!
పదార్ధ మేదియైన సరే!పరమాత్మంబంచు నెంచు!వాదిలం నిజంబు  నిల్చుగా!
గదా ధరుండు మెచ్చు తుదిన్?కరటేలా?స్వార్ధ మాపు!కాదనంగ రాదు శ్రేయమున్!
నిదానమే!ప్రధాన మనన్!నెఱకాడౌ!లోకమందు!నీదు కీర్తి నిల్పు భూ తలిన్!
అర్ధములు.
కరటేలా=కఠినత్వ మెందులకు,గదాధరుడు=యమధర్మరాజు,నెఱకాడు=
పూర్ణుడు ,
1.గర్భగత"-జరాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.స.గణములు.వృ.సం.214.
ప్రాసనియమము కలదు.
యదార్థ మెంతొ?చేదుకదా!
పదార్ధ మేదియైన సరే!
గదా ధరుండు మెచ్చు తుదిన్!
నిదానమే!ప్రధాన మనన్?
2.గర్భగత"-కలివర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.త.గల.గణములు.వృ.సం.164.
ప్రాసనియమము కలదు.
హరుడైనా!యాగ్రహించు!
పరమాత్మంబంచు నెంచు!
కరటేలా?స్వార్థ మాపు!
నెఱకాడౌ!లోకమందు!
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
ఆదు కొనున్!నీతి యొక్కటే!
వాదిలం!నిజంబు నిల్చుగా!
కాదనంగ రాదు!శ్రేయమున్!
నీదు కీర్తి నిల్పు భూతలిన్!
4.గర్భగత"-నిల్కడ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.స.స.త.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
యదార్థ మెంతొ?చేదు గదా!హరుడైనా యాగ్రహించు!
పరార్థ మేదియైన సరే?పరమాత్మంబంచు నెంచు!
గదాధరుడు మెచ్చు తుదిన్!కరటేలా?స్వార్థ మాపు!
నిదానమే!ప్రధాన మనన్?నెరకాడౌ?లోకమందు!
5.గర్భగత"-సత్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.ర.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
.హరుడైనా!యాగ్రహించు!ఆదుకొనున్?నీతి యొక్కటే!
పరమాత్మంబంచు నెంచు!వాదిలం నిజంబు నిల్చుగా!
కరటేలా?స్వార్థ మాపు!కాదనంగరాదు!శ్రేయమున్!
నెఱకాడౌ?లోకమందు!నీదు కీర్తి నిల్పు భూతలిన్!
6.గర్భగత"-సత్వరాశ్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.ర.స.ర.జ.ర.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హరుడైనా!యాగ్రహించు!ఆదుకొనున్?నీతి యొక్కటే!యదార్థ మెంతొ? చేదుగదా!
పరమాత్మంబంచు నెంచు!వాదిలం నిజంబు నిల్చుగా!పరార్థ మేదియైన సరే!
కరటేలా?స్వార్ధ మాపు!కాదనంగ రాదు శ్రేయమున్!గదాధరుండు మెచ్చు తుదిన్!
నెఱ కాడౌ!లోకమందు!నీదు కీర్తి నిల్పు భూతలిన్!నిదానమే!ప్రధాన మనన్?
7గర్భగత"-నెఱకాడు"-వృత్తము.
ధృతిఛందము.భ.త.ర.జ.ర.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆదుకొనుం నీతి యొక్కటే?యదార్థ మెంతొ?చేదుగదా!
వాదిలం నిజంబు నిల్చుగా!పరార్థ మేదియైన సరే!
కాదనంగ రాదు శ్రేయమున్!గదాధరుండు మెచ్చు తుదన్!
నీదు కీర్తి నిల్చు భూతలిన్!నిదానమే!ప్రధాన మనన్?
8.గర్భగత"-కరటేలన్"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.జ.ర.స.స.త.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆదు కొనుం నీతి యొక్కటే?యదార్థ మెంతొ?చేదు గదా!హరుడైనా యాగ్రహించు!
వాదిలం నిజంబు నిల్చుగా!పరార్థ మేదియైన సరే!పరమాత్మంబంచు నెంచు!
కాదనంగ రాదు శ్రేయమున్!గదాధరుండు మెచ్చు తుదన్!కరటేలా? స్వార్ధ మాపు!
నీదు కీర్తి నిల్చు భూతలిన్!నిదానమే ప్రధాన మనన్?నెఱకాడౌ! లోకమందు!
9,గర్భగత"-ఆగ్రహ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.భ.ర.జ.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హరుడైనా!యాగ్రహించు!యదార్ధ మెంతొ?చేదుగదా!
పరమాత్మంబంచు నెంచు!పరార్ధ మేదియైన సరే?
కరటేలా?స్వార్ధ మాపు!గదాధరుండు మెచ్చు!తుదన్?
నెఱకాడౌ!లోకమందు!నిదానమే!ప్రధానమమన్?
10,గర్భగత"-యదార్ధతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.భ.ర.జ.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం
హరుడైనా!యాగ్రహించు!యదార్ధ మెంతొ?చేదుగదా!ఆదుకొనుం నీతి యొక్కటే!
పరమాత్మంబంచు నెంచు!పరార్థ మేదియైన సరే?వాదిలం నిజంబు నిల్చుగా!
కరటేలా?స్వార్థ మాపు!గదా ధరుండు మెచ్ఛు తుదన్!కాదనంగ రాదుశ్రేయమున్!
నెఱకాడౌ!లోకమందు!నిదానమే!ప్రధాన మనన్?నీదు కీర్తి నిల్పు భూతలిన్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.