గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2020, శనివారం

తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ కృత అష్ట విధ కందము.

జై శ్రీరామ్.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ కృత అష్ట విధ కందము.
“అష్టవిధ కందము” అమ్మ శారదాంబ దయతో. 

1. జనవర కలలను గను చును
కనులను కలియగ గనుకను కళుకుల కలయై
కనబడ వెలుగుల కనుకలి
నినుచను వెలసె “కుజ” నలిని నిలచెను కలిమై

2. కను చును కనులను కలియగ
గనుకను కళుకుల కలయై కనబడ వెలుగుల్
కనుకలి నినుచను వెలసె “కు
జ” నలిని నిలచెను కలిమయి జనవర కలలన్.

3. కలియగ గనుకను కళుకుల
కలయై కనబడ వెలుగులు కనుకలి నినుచన్
వెలసె “కుజ” నలిని నిలచెను
కలిమై జనవర కలలను గను చును కనులన్.

4. కళుకుల కలయై కనబడ
వెలుగులు కనుకలి నినుచను వెలసె “కుజ” నలిన్
నిలచెను కలిమై జనవర
కలలను గను చును కనులను కలియగ గనుకన్.

5. కనబడ వెలుగుల కనుకలి
నినుచను వెలసె “కుజ” నలిని నిలచెను కలిమై
జనవర కలలను గను చును
కనులను కలియగ గనుకను కళుకుల కలయై

6. కనుకలి నినుచను వెలసెకు
జనలిని నిలచెను కలిమై జనవర కలలన్.
గను చును కనులను కలియగ
గనుకను కళుకుల కలయై కనబడ వెలుగుల్

7. వెలసె “కుజ” నలిని నిలచెను
కలిమై జనవర కలలను గను చును కనులన్.
కలియగ గనుకను కళుకుల
కలయై కనబడ వెలుగులు కనుకలి నినుచన్

8. నిలచెను కలిమై జనవర
కలలను గను చును కనులను కలియగ గనుకన్.
కళుకుల కలయై కనబడ
వెలుగులు కనుకలి నినుచను వెలసె “కుజ” నలిన్

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.