జైశ్రీరామ్.
భాస్వర,వరమౌ,హృత్స్ఫందనా,యశోవిరాజి,భగవంత,జిగివిడు,స్థాణువ,సన్మయా,యశశ్వి,శ్రీసన్నిభా,గర్భ"-సుమయ శ్రీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
సుమయ శ్రీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.ర.స.న.స.ర.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శ్రీ యమ!సుశివ నావశి!శివనా వశి సుమయ శ్రీ!చిగురించు భువి శోభల్!
పాయదు ఘన యశంబును!భవ బంధము లెడమవన్?భగవంత మదియే! లే?
శ్రీయశవర!దయామయ!చివరం!పరమ పదమౌ?జిగి వీడ వలదోయీ?
నేయము గను!సదాచర!నివసించుమి!శుభగతన్!నిగమంబులకు కొప్పై?
అర్ధములు:-సుమయ=పద్మమే!శ్రీ=లక్ష్మీదేవి,సుశివనా=మంచి శాంత
స్వరూప మన బడు,(లక్ష్మి),నావశి=నా కనుకూలము,జిగి వీడవలదు=
పట్టును సడలింప రాదు,సదాచర=సత్యము నాచరించుమ,శుభగతన్=
మంచిగ,నిగమంబుల కొప్పై=వేదములకు మకుటాయమానమై,
భావము:-సుగుణాల రాశి యగు శ్రీమన్మహాలక్ష్మి నాకను కూలమగును.
అనగా నేను లక్ష్మీ సంపన్నుడ నగుదును,శాంతమే శివ మనబడి నన్ను
కటాక్షించెను.పద్మమే లక్ష్మీదేవి.భూమాతకు శోభలు చిగురింప జేయును.
కీర్తి వదలిపోదు.భవ బంధములు దూరము కాబడినను,భగవచ్ఛింతనమే
శుభము.సత్ప్రవర్తనను స్నేహమును పెంచుకొనుము.జిగి సడలని మంచి
మార్గమున జీవించుము.
1.గర్భగత"-భాస్వర"-వృత్తము.
బృహతీఛందము.భ.న.భ.గణములు.వృ.సం.447.
ప్రాసనియమము కలదు.
శ్రీ యమ!సుశివ నావశి!
పాయదు ఘన యశంబున్?
శ్రీయశవర దయామయ!
నేయము గను సదాచర!
2.గర్భగత"-వరమౌ"-వృత్తము.
బృహతీఛందము.స.న.స.గణములు.వృ.సం.252.
ప్రాసనియమము కలదు.
శివనా వశి సుమయ శ్రీ!
భవ బంధము లెడ మవన్?
చివరం పరమ పదమౌ?
నివసించుమి!శుభగతన్!
3.గర్భగత"-హృత్స్పంధనా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.గగ.గణములు.వృ.సం.80.
ప్రాసనియమము కలదు.
చిగురించు భువి శోభల్!
భగవంత మదియే?లే!
జిగి వీడ వలదోయీ?
నిగమంబులకు కొప్పై!
4.గర్భగత"-యశోవిరాజి"-వృత్తము.
ధృతిఛందము.భ.న.భ.స.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శ్రీయమ!సుశివ నా వశి!శివనా వశి సుమయ శ్రీ!
పాయదు ఘన యశంబున్?భవ బంధము లెడ మవన్?
శ్రీ యశవర దయామయ!చివరం పరమ పదమౌ?
నేయము గను!సదాచర!నివశించుమి!శుభగతన్!
5.గర్భగత"-భగవంత"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.స.ర.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివ నా వశి!సుమయ శ్రీ!చిగురించు భువి శోభల్!
భవ బంధము లెడ మవన్?భగవంత మదియే!లే?
చివరం పరమ పదమౌ?జిగి వీడ వలదోయీ?
నివసించుమి!శుభగతన్?నిగమంబులకు కొప్పై!
6.గర్భగత"-జిగివిడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.స.ర.న.మ.స.స.లల.గణములు.యతులు,10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివ నావశి సుమయ శ్రీ!చిగురించు భువి శోభల్!శ్రీయమ సుశివ నావశి!
భవ బంథము లెడ మవన్?భగవంత మదియే!లే?పాయదు ఘన యశంబును!
చివరం పరమ పదమౌ?జిగి వీడ వలదోయీ?శ్రీ యశవర దయామయ!
నివసించుమి!శుభగతన్?నిగమంబులకు కొప్పై!నేయము గను సదాచర!
7.గర్భగత"-స్థాణువా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.మ.న.స.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిగురించు భువి శోభల్!శ్రీయమ సు శివనా వశి!
భగవంత మదియే!లే?పాయదు ఘన యశంబును!
జిగి వీడ వలదోయీ?శ్రీ యశ వర దయా మయ!
నిగమంబులకు కొప్పై!నేయము గను సదాచర!
8.గర్భగత"-సన్మయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.మ.న.స.న.జ.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిగురించు భువి శోభల్!శ్రీయమ సు శివనా వశి!శివ నావశి సుమయ శ్రీ!
భగవంత మదియే?లే!పాయదు ఘన యశంబును!భవ బంథము లెడ మవన్?
జిగి వీడ వలదోయీ?శ్రీ యశవర దయామయ!చివరం పరమ పదమౌ?
నిగమంబులకు!కొప్పై!నేయము గను సదాచర!నివసించుమి!శుభగతన్?
9.గర్భగత"-యశశ్వి"-వృత్తము.
ధృతిఛందము.స.న.స.భ.న.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివ నావశి సుమయ శ్రీ!శ్రీయమసు శివనా వశి!
భవ బంధము లెడ మవన్?పాయదు ఘన యశంబును!
చివరం పరమ పదమౌ?శ్రీయశ వర దయామయ!
నివసించుమి!శుభగతన్?నేయము గను సదాచర!
10,గర్భగత"-శ్రీ సన్నిభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.భ.భ.న.భ.స.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివ నావశి సుమయ శ్రీ!శ్రీయమ సు శివనా వశి!చిగురించు భువి శోభల్!
భవ బంథము లెడ మవన్?పాయదు ఘన యశంబును!భగవంత మదియే?
చివరం పరమ పదమౌ?శ్రీ యశ వర దయామయ!జిగి వీడ వలదోయీ!
నివసించుమి!శుభగతన్?నేయము గను సదాశివ!నిగమేబులకు కొప్పై!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.