గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

వినయశా,జీవప్రేమ,శాసయా,చాతురి,అచలా,అశాశ్వత,ధన్యతా,గతస్థితి,స్థిరమతి,కీర్తిలు,గర్భ"-చలమా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వినయశా,జీవప్రేమ,శాసయా,చాతురి,అచలా,అశాశ్వత,ధన్యతా,గతస్థితి,స్థిరమతి,కీర్తిలు,గర్భ"-చలమా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-అచలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.జ.భ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గత మెరిగి మనవలెన్?కలిమి!యశాశ్వతంబు!ఘన కీర్తి గడింపు ధాత్రిన్!
మతి స్థిరము కనవలెన్?మలినుల దూర ముంచు!మనసార నుతింపు దైవమ్!
చతుర మతి వనునటుల్?చల మచలంబు లెంచు!చనుమా!బుధ మార్గ మందున్!
గతి కుదురుగ!నరుడా?కలతల జేర నీకు!కను సాటి జనంపు మేలున్!
1.గర్భగత"-వినయశా"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.
ప్రాసనియమము కలదు.
గత మెరిగి మనవలెన్?
మతి స్థిరము గన వలెన్?
చతుర మతి వను నటుల్?
గతి కుదురుగ !నరుడా?
2.గర్భగత"-జీవ ప్రేమ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.జ.గల.గణములు.వృ.సం.176.
ప్రాసనియమము కలదు.
కలిమి యశాశ్వతంబు!
మలినుల దూరముంచు!
చల మచలంబు లెంచు!
కలతల జేర నీకు!
3.గర్భగత"-శాసయా"-వృత్తము.
బృహతీఛందము.స.స.య.గణములు.వృ.సం.92.
ప్రాసనియమము కలదు.
ఘనకీర్తి గడింపు ధాత్రిన్!
మనసార నుతింపు దైవమ్!
చనుమా!బుధ మార్గమందున్!
కను సాటి జనంపు!మేలున్!
4.గర్భగత"-చాతురి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గత మెరిగి మనవలెన్?కలిమి యశాశ్వతంబు!
మతి స్థిరము గన వలెన్?మలినుల దూర ముంచు!
చతుర మతి వనునటుల్?చల మచలంబు లెంచు!
గతి కుదురుగ?నరుడా!కలతల జేర నీకు!
5.గర్భగత"-అచలా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.భ.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిమి యశాశ్వతంబు!ఘన కీర్తి గడింపు ధాత్రిన్?
మలినుల దూర ముంచు!మనసార నుతింపు దైవమ్!
చల మచలంబు లెంచు!చనుమా!బుధ మార్గ మందున్!
కలతల జేర నీకు!కను సాటి జనంపు మేలున్?
6.గర్భగత"-అశాశ్వత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.జ.జ.త.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిమి యశాశ్వతంబు!ఘన కీర్తి గడింపు ధాత్రిన్!గత మెరిగి మన వలెన్?
మలినుల దూర ముంచు!మనసార నుతింపు దైవమ్!మతి స్థిరము  గనవలెన్?
చల మచలంబు లెంచు!చనుమా!బుధ మార్గ మందున్!చతుర మతి వను నటుల్?
కలతల జేర నీకు!కను సాటి జనంపు మేలున్!గతి కుదురంగ!నరుడా!
7.గర్భగత"-ధన్యతా"-వృత్తము.
ధృతిఛందము.స.స.య.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం
ఘన కీర్తి గడింపు ధాత్రిన్!గత మెరిగి మన వలెన్?
మనసార నుతింపు దైవమ్!మతి స్థిరము గన వలెన్?
చనుమా!బుధ మార్గమందున్!చతుర మతి వనునటుల్!
కను సాటి జనంపు మేలున్!గతి కుదురంగ!నరుడా!
8.గర్భగత"-గత స్థితి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.న.న.స.న.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఘనకీర్తి గడింపు ధాత్రిన్!గత మెరిగి మనవలెన్?కలిమి యశాశ్వతంబు!
మనసార నుతింపు దైవమ్!మతి స్థిరము గన వలెన్?మలినుల దూర ముంచు!
చనుమా!బుధ మార్గమందున్!చతుర మతి వనునటుల్?చల మచలంబు లెంచు!
కను సాటి జనంపు మేలున్!గతి కుదురంగ నరుడా!కలతల జేర నీకు!
9.గర్భగత"-స్థిరమతి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.భ.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిమి యశాశ్వతంబు!గత మెరిగి మనవలెన్?
మలినుల దూర ముంచు!మతి స్థిరము  గనవలెన్?
చల మచలంబు లెంచు!చతుర మతి వను నటుల్?
కలతల జేర నీకు!గతి కుదురంగ!నరుడా!
10,గర్భగత"-కీర్తిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.న.న.జ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
కలిమి యశాశ్వతంబు!గత మెరిగి మనవలెన్?ఘన కీర్తి గడింపు ధాత్రిన్!
మలినుల దూర ముంచు!మతి స్థిరము గనవలెన్?మనసార నుతింపు దైవమున్!
చల మచలంబు లెంచు!చతుర మతి వను నటుల్?చనుమా!బుధ మార్గ మందున్!
కలతల జేర నీకు!గతి కుదురంగ నరుడా!కను సాటి జనంపు మేలున్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.