గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, సెప్టెంబర్ 2020, గురువారం

మత్తరజినీ,సమానీ,నరసా,రజోరజ,సఖ్యతా,అసచ్ఛరా,దోష చరా,దప్పర,మింటినంటు,కుటిలాలక,గర్భ"-మాయామోహ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
మత్తరజినీ,సమానీ,నరసా,రజోరజ,సఖ్యతా,అసచ్ఛరా,దోష చరా,దప్పర,మింటినంటు,కుటిలాలక,గర్భ"-మాయామోహ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
                         
మాయామోహ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.జ.స.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మాయామోహ ద్రోహ పూర్ణులై!మంచి నించు కెంచ రిలన్!మనుజ నీతిమారె కలిన్!
తీయుచుంద్రు గోతు లొడ్లకున్?తెంచ రా రదేల?సురల్!దినకరుండె!సాక్షి గదా!
చేయ జాల కూర కొంటివా?చించ వేల?దుర్మదులన్!చెనకి నారు!ధర్మ మిలన్!
పాయ నేల?కర్మ కర్తృకా!వంచనంపు జీవతతిన్?వనథి మ్రింగునైజమునన్?
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
మాయ మోహ ద్రోహ పూర్ణులై!
తీయు చుంద్రు గోతు లొడ్లకున్?
చేయ జాల కూర కొంటివా?
పాయ నేల?కర్మ కర్తృకా!
2.గర్భగత"-సమానీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.లగ.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
మంచి నించు కెంచ రిలన్!
తెంచ రారదేల?సురల్!
చించ వేల?దుర్మదులన్!
వంచ నంపు జీవతతిన్!
3.గర్భగత"-నరసా"-వృత్తములు.
బృహతీఛందము.న.ర.స.గణములు.వృ.సం.216.
ప్రాసనియమము కలదు.
మనుజ నీతి మారె కలిన్!
దిన కరుండె!సాక్షి గదా!
చెనకి నారు ధర్మ  మిలన్!
వనథి మ్రింగు నైజమునన్?
4.గర్భగత"-రజోరజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మాయ మోహ ద్రోహ పూర్ణులై!మంచి నించు కెంచ రిలన్?
తీయు చుండ్రు గోతు లొడ్లకున్?తెంచ రా రదేల?సురల్!
చేయ జాల కూరకొంటివా?చించ వేల?దుర్మదులన్!
పాయ నేల?కర్మ కర్తృకా!వంచ నంపు జీవతతిన్?
5.గర్భగత"-సఖ్యతా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.జ.స.జ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మంచి నించు కెంచ రిలన్!మనుజ నీతి మారె కలిన్!
తెంచ రా రదేల?సురల్!దిన కరుండె! సాక్షిగదా!
చించవేల?దుర్మదులన్!చెనకి నారు ధర్మ మిలన్?
వంచ నంపు జీవతతిన్?వనథి మ్రింగు నైజము నన్?
6.గర్భగత"-అసచ్ఛరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.జ.స.జ.య.జ.ర.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మంచి నించు కెంచ రిలన్?మనుజ నీతి మారె!కలిన్!మాయ మోహ ద్రోహపూర్ణులై!
తెంచ రా రదేల?సురల్!దిన కరుండె సాక్షి గదా!తీయు చుంద్రు గోతులొడ్లకున్?
చించ వేల?దుర్మదులన్!చెనకి నారు ధర్మ మిలన్?చేయ జాల కూరకొంటివా?
వంచ నంపు జీవ తతిన్?వనథి మ్రింగు నైజమునన్!పాయ నేల?కర్మకర్తృకా!
7.గర్భగత"-దోషచరా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.స.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనుజ నీతి మారె!కలిన్!మాయ మోహ ద్రోహ పూర్ణులై!
దిన కరుండె!సాక్షి గదా!తీయు చుంద్రు గోతు లొడ్లకున్?
చెనకి నారు ధర్మ మిలన్?చేయ జాల కూర కొంటివా?
వనథి మ్రింగు నైజము నన్ !పాయ నేల?కర్మ కర్తృకా!
8.గర్భగత"-దప్పర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.స.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనుజ నీతి మారె!కలిన్!మాయ మోహ ద్రోహ పూర్ణులై!మంచి నించుకెంచ రిలన్?
దిన కరుండె!సాక్షి గదా!తీయు చుంద్రు గోతు లొడ్లకున్?తెంచ రా రదేల? సురల్!
చెనకి నారు ధర్మ మిలన్?చేయ జాల కూర కొంటివా?చించ వేల?దుర్మదులన్!
వనథి మ్రింగు నైజమునన్? పాయ నేల? కర్మ కర్తృకా!వంచనంబె!లోకమయెన్?
9,గర్భగత"-మింటినంటు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మంచి నించు కెంచ రిలన్?మాయ మోహ ద్రోహ పూర్ణులై!
తెంచ రా రదేల?సురల్!తీయు చుంద్రు గోతు లొడ్లకున్?
చించ వేల?దుర్మదులన్!చేయ జాల కూరకొంటివా?
వంచనంబె!లోక మయెన్?పాయ నేల?కర్మ కర్తృకా!
10,గర్భగత"-కుటిల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.య.జ.ర.జ.స.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మంచి నించు కెంచ లిలన్?మాయ మోహ ద్రోహ పూర్ణులై!మనుజ నీతిమారె కలిన్!
తెంచ రా రదేల?సురల్!తీయు చుంద్రు గోతు లొడ్లకున్?దినకరుండె!సాక్షిగదా!
చించ వేల?దుర్మదులన్!చేయ జాల కూర కొంటివా?చెనకి నారు ధర్మమిలన్?
వంచ నంబె!లోక మయెన్?పాయ నేల?కర్మ కర్తృకా!వనథి మ్రింగునైజమునన్!
  జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.