గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2020, ఆదివారం

శ్రీవాణీద్వయ,మోహినీ,ఉత్తుంగ ద్వయ,గతినిడు ద్వయ,మథురిమ, క్షితిధర్మ,సాయినీ,సనరా,జీవక,స నారస,తద్భ్రమ ద్వయ,రవినా,లోకేశ ద్వయ,భవహర ద్వయ,గతమెంచుద్వయ,జిత మన్మథాద్వయ,గర్భ"-స్థిత ప్రజ్ఞా"-ద్యయ వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
శ్రీవాణీద్వయ,మోహినీ,ఉత్తుంగ ద్వయ,గతినిడు ద్వయ,మథురిమ, క్షితిధర్మ,సాయినీ,సనరా,జీవక,స నారస,తద్భ్రమ ద్వయ,రవినా,లోకేశ ద్వయ,భవహర ద్వయ,గతమెంచుద్వయ,జిత మన్మథాద్వయ,గర్భ"-స్థిత ప్రజ్ఞా"-ద్యయ వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                             
స్థిత ప్రజ్ఞా"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.స.య.న.ర.భ.జ.స.య.లగ.గణములు.యతులు.
8,15,23,ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
జిత మన్మథా కార!శితి కంఠ లోకేశ!శివు డీవు భవు డీవు!జీవే శ్వరా!
గత మెంచ జాలంగ!గతిగూర్చి మన్నించు!కవి వీవు!రవి వీవు!కావంగరా!
స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోవు!శివ మేర్చు పిత వీవు!సేవింతునిన్!
బ్రతుకెల్ల మేల్జేయు!పతి వీవు సర్వాత్మ!భవ హారి శుభదాయి!భావింతునిన్!
2.
శితి కంఠ!లోకేశ!జిత మన్మథాకార!శివు డీవు భవుడీవు!జీవేశ్వరా!
గతి గూర్చి మన్నించు!గత మెంచ జాలంగ!కవి వీవు రవి వీవు కావంగరా!
క్షితి ధర్మమున్బ్రోవు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!శివ మేర్చు పిత వీవు!సేవింతు నిన్!
పతి వీవు!సర్వాత్మ!బ్రతుకెల్ల మేల్జేయు!భవ హారి శుభదాయి!భావింతు నిన్!
1.గర్భగత"-శ్రీవాణీ"-ద్వయవృత్తములు.
ఉష్ణిక్ఛందము.స.య.ల.గణములు.వృ.సం.76.
ప్రాసనియమము కలదు.
1.జిత మన్మథాకార!                            2.శితి కంఠ!లోకేశ!
  గత మెంచ జాలంగ!                             గతి గూర్చి మన్నించు!
  క్షితి ధర్మ మున్బ్రోవు!                           స్థిత ప్రజ్ఞ జేకూర్చు!  
పతి వీవు!సర్వాత్మ!                              బ్రతుకెల్ల మేల్జేయు!
2.గర్భగత"-మోహినీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.గల.గణములు.వృ.సం.185.
ప్రాసనియమము కలదు.
శివు డీవు!భవు డీవు!
కవి వీవు!రవి వీవు!
శివ మేర్చు!పిత వీవు!
భవ హారి!శుభదాయి!
3.గర్భగత"-ఉత్తుంగ ద్వయ"-వృత్తములు.
శక్వరీఛందము.స.య.న.ర.గల.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1
జిత మన్మథా కార!శితి కంఠ లోకేశ!
గత మెంచ జాలంగ!గతి గూర్చి మన్నించు!  
క్షితి ధర్మమున్బ్రోవు!స్థిత ప్రజ్ఞ చేకూర్చు!
పతి వీవు సర్వాత్మ!బ్రతుకెల్ల మేల్జేయు!  
2.
శితి కంఠ లోకేశ! జిత మన్మథాకార!
గతి గూర్చి మన్నించు!గత మెంచ జాలంగ!
స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోవు!
బ్రతుకెల్ల మేల్జేయు!పతివీవు సర్వాత్మ!
4.గర్భగత"-గతినిడు"-ద్వయ వృత్తములు.
ఆకృతిఛందము.స.య.న.ర.భ.జ.స.ల.గణములు.యతులు.8,15.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
జిత మన్మథాకార!శితి కంఠ!లోకేశ!శివు డీవు!భవు డీవు!
గత మెంచ జాలంగ!గతి గూర్చి!మన్నించు!కవి వీవు రవి వీవు!
క్షితి ధర్మమున్బ్రోవు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!శివ మేర్చు పతి వీవు!
పతి వీవు సర్వాత్మ!బ్రతుకెల్ల మేల్జేయు!భవ హారి శుభ దాయి!
2.
శితి కంఠ లోకేశ!జిత మన్మథా కార!శివు డీవు!భవు డీవు!
గతి గూర్చి మన్నించు!గత మెంచ జాలంగ!కవి వీవు!రవి వీవు!
స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్బోవు!శివ మేర్చు!పతి వీవు!
బ్రతు కెల్ల మేల్జేయు!పతి వీవు!సర్వాత్మ!భవ హారి!శుభ దాయి!
5.గర్భగత"-మథురిమ"-వృత్తము.
అతి శక్వరీవృత్తము.స.య.న.భ.జ.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శితి కంఠ!లోకేశ!శివు డీవు!భవు డీవు!
గతి గూర్చి మన్నించు!కవి వీవు!రవి వీవు!
క్షితి ధర్మమున్బ్రోచు!శివ మేర్చు పతి వీవు!
పతి వీవు!సర్వాత్మ!!భవ హారి!శుభ దాయి!
6.గర్భగత"-క్షితి ధర్మ"-వృత్తము.
అతిధృతిఛందము.స.య.న.భ.జ.త.గ.గణములు.యతులు.8,15.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శితికంఠ!లోకేశ!శివుడీవు భవుడీవు!జీవేశ్వరా!
గతి గూర్చి మన్నించు కవి వీవు రవి వీవు!కావంగ రా!
క్షితి ధర్మమున్బ్రోచు!శివ మేర్చు పతి వీవు!సేవింతు నిన్!
పతివీవు సర్వాత్మ!భవ హారి!శుభ దాయి!భావింతు నిన్!
7.గర్భగత"-సాయినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.న.భ.జ.త.భ.ర.గల.గణములు.యతులు.8,15,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
శితి కంఠ!లోకేశ!శివు డీవు!భవుడీవు!జీవేశ్వరా!జిత మన్మథాకార!
గతి గూర్చి మన్నించు!కవివీవు!రవి వీవు!కావంగ రా!గతమెంచ జాలంగ!
క్షితి ధర్మమున్బ్రోచు!!శివ మేర్చు పతి వీవు!సేవింతు నిన్!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!
పతి వీవు!సర్వాత్మ!భవ హారి!శుభదాయి!భావింతు నిన్!బ్రతుకెల్ల మేల్జేయు!
8.గర్భగత"-సనరా"-వృత్తము.
జగతీ ఛందము.స.న.ర.ర.గణములు.యతి.9,.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివు డీవు!భవు డీవు!జీవేశ్వరా!
కవి వీవు!రవి వీవు!కావంగ రా!
శివ మేర్చు పతి వీవు!సేవింతు నిన్!
భవ హారి!శుభ దాయి!భావింతు నిన్!
9.గర్భగత"-జీవక"-వృత్తము.
అతి ధృతి ఛందము.స.న.ర.ర.స.య.ల.గణములు.యతులు.9,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శివు డీవు!భవు డీవు!జీవేశ్వరా!జిత మన్మథాకార!
కవి వీవు!రవి వీవు!కావంగ రా!గత మెంచ జాలంగ!
శివ మేర్చు!పతి వీవు!సేవింతు నిన్!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!
భవ హారి!శుభ దాయి!భావింతు నిన్!బ్రతుకెల్ల!మేల్జేయు!
10,గర్భగత"-స నారస"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.ర.ర.స.య.న.ర.గల.గణములు.యతులు.
9,13,20,ప్రాసనియమము కలదు.వృ.సం.
శివు డీవు భవుడీవు!జీవేశ్వరా!జిత మన్మథాకార!శితి కంఠ!లోకేశ!
కవి వీవు రవివీవు!కావంగ రా!గత మెంచజాలంగ!గతి గూర్చి మన్నించు!
శివ మేర్చు పతివీవు!సేవింతు నిన్!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోచు!
భవ హారి శుభదాయి!భావింతు నిన్!బ్రతుకెల్ల మేల్జేయు!పతి వీవు!సర్వాత్మ!
11.గర్భగత"-తద్భ్రమ"-ద్వయ వృత్తములు.
త్రిష్టుప్ఛందము.త.భ.ర.గల.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.                                                   2.
  జీవేఏశ్వరా!జిత మన్మథాకార!         జీవేశ్వరా!శితి కంఠ లోకేశ!
కావంగ రా!గత మెంచ జాలంగ.        కావంగ రా!గతి గూర్చి మన్నించు!
సేవింతు నిన్!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!      సేవింతు నిన్!క్షితి ధర్మమున్బ్రోచు!
భావింతు నిన్!బ్రతుకెల్ల మేల్జేయు!     భావింతు నిన్!పతి వీవు!సర్వాత్మ!
12.గర్భగత"-రవినా"-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.త.భ.ర.భ.జ.త.గణములు.యతులు.5,12.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
జీవేశ్వరా!జిత మన్మథా కార!శితి కంఠ!లోకేశ!
కావంగ రా!గతమెంచ జాలంగ!గతి గూర్చి మన్నించు!
సేవింతు నిన్!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోచు!
భావింతు నిన్!బ్రతుకెల్ల మేల్జేయు!పతి వీవు సర్వాత్మ!
2.
జీవేశ్వరా!శితికంఠ!లోకేశ!జిత మన్మథాకార!
కావంగ రా!గతి గూర్చి మన్నించు!గత మెంచజాలంగ!
సేవింతు నిన్!క్షితి ధర్మమున్బ్రోచు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!
భావింతు నిన్!పతి వీవు!సర్వాత్మ!బ్రతుకెల్ల మేల్జేయు!
13.గర్భగత"-లోకేశ"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.త.భ.ర.భ.జ.త.స.న.గల.గణములు.యతులు.
5,12,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
1
జీవేశ్వరా!జిత మన్మథాకార!శితికంఠ!లోకేశ!శివు డీవు!భవుడీవు!
కావంగ రా!గత మెంచ జాలంగ!గతి గూర్చి మన్నించు!కవి వీవు!రవి వీవు!
సేవింతు నిన్!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోచు!శివ మేర్చు!పతివీవు!
భావింతు నిన్!బ్రతుకెల్ల మేల్జేయు!పతి వీవు!సర్వాత్మ!భవ హారి శుభ దాయి!
2.
జీవేశ్వరా!శితి కంఠ!లోకేశ!జిత మన్మథాకార!శివు డీవు!భవుడీవు!
కావంగ రా!గతి గూర్చి!మన్నించు!గత మెంచ జాలంగ!కవి వీవు!రవి వీవు!
సేవింతు నిన్!క్షితి ధర్మమున్బ్రోచు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!శివ మేర్చు పతి వీవు!
భావింతు నిన్!పతి వీవు!సర్వాత్మ!బ్రతు కెల్ల మేల్జేయు!భవ హారి!శుభదాయి!
14.గర్భగత"-భవహర"-ద్వయ వృత్తములు.
అతిశక్వరీ"-వృత్తము.స.న.భ.జ.త.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
శివు డీవు!భవుడీవు!శితి కంఠ!లోకేశ!
కవి వీవు!రవి వీవు!గతి గూర్చి మన్నించు!
శివ మేర్చు పతి వీవు!క్షితి ధర్మమున్బ్రోచు!
భవ హారి శుభ దాయి!పతి వీవు సర్వాత్మ!
2.
శివు డీవు!భవుడీవు!జిత మన్మథాకార!
కవి వీవు!రవి వీవు!గత మెంచ జాలంగ!
శివ మేర్చు!పతి వీవు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!
భవ హారి!శుభదాయి!బ్రతుకెల్ల మేల్జేయు!
15.గర్భగత"-గతమెంచు"-ద్వయ వృత్తములు.
ఆకృతిఛందము,స.న.భ.జ.త.స.య.ల.గణములు.యతులు.9,16.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
శివు డీవు!భవుడీవు!శితికంఠ!లోకేశ!జిత మన్మథాకార!
కవి వీవు!రవి వీవు!గతి గూర్చి మన్నించు!గత మెంచ జాలంగ!
శివ మేర్చు పతి వీవు!క్షితి ధర్మమున్బ్రోచు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!
భవ హారి!శుభదాయిీపతి వీవు!సర్వాత్మ!బ్రతుకెల్ల మేల్జేయు!
2,
శివు డీవు!భవుడీవు!జిత మన్మథాకార!శితి కంఠ లోకేశ!
కవి వీవు!రవి వీవు!గత  మెంచ జాలంగ!గతి గూర్చి మన్నించు!
శివ మేర్చు!పతి వీవు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోచు!
భవ హారి!శుభదాయి!బ్రతు కెల్ల మేల్జేయు!పతి వీవు సర్వాత్మ!
16.గర్భగత"-జిత మన్మథా ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.స.న.భ.జ.త.స.య.య.లగ.గణములు.యతులు.
9,16,23,ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
శివు డీవు!భవుడీవు!శితికంఠ!లోకేశ!జిత మన్మథాకార!జీవేశ్వరా!
కవి వీవు!రవివీవు!గతిగూర్చి మన్నించు!గత మెంచ జాలంగ!కావంగ రా!
శివ మేర్చు!పతి వీవు!క్షితి ధర్మమున్బ్రోచు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!సేవింతు నిన్!
భవ హారి!శుభదాయి!పతి వీవు!సర్వాత్మ!బ్రతు కెల్ల మేల్జేయు!భావింతు నిన్!
2.
శివు డీవు!భవుడీవు!జిత మన్మ థాకార!శితి కంఠ లోకేశ!జీవేశ్వరా!
కవి వీవు!రవి వీవు!గత మెంచజాలంగ!గతి గూర్చి!మన్నించు!కావంగ రా!
శివ మేర్చు!పతి వీవు!స్థిత ప్రజ్ఞ జేకూర్చు!క్షితి ధర్మమున్బ్రోచు!సేవింతు నిన్!
భవ హారి!శుభదాయి!బ్రతుకెల్ల!మేల్జేయు!పతి వీవు!సర్వాత్మ!భావింతు నిన్!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.