జైశ్రీరామ్.
మనయా,త్యాగశీల,మాతా,మానయా,నీతికోరు,సమయతా,ఆశాంత,మనవరయా,కోరునీతి,జారచోర,గర్భ"-జగన్మూల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-జగన్మూల"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.న.మ.ర.య.త.స.య.గగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కుంభీపాత నరకం బేలన్?కోరు నీతిమార్గం భూమిన్!కులము నిల్పు
నాశాంతంబున్!
జంబూద్వీప జననం పుణ్యమ్!జార చోర తీరే!నాశమ్!చలిత బుద్ధియే?
దుష్కర్మమ్!
శంభో!శంకర యనం!మోక్షమ్!చారు శీల మెంచే!వాడౌ!స లలితంబదే?
సద్ధర్మమ్!
అంబేమూలము!జగంబంతన్!ఆరనీకు జీవం జ్యోతిన్!అలల సాగరిన్!
దాటింపన్?
1.గర్భగత"-మనయా"-వృత్తము.
బృహతీఛందము.మ.న.య.గణములు.వృ.సం.121.
ప్రాసనియమము కలదు.
కుంభీపాత నరకం బేలన్?
జంబూ ద్వీప జననం పుణ్యమ్!
శంభో!శంకర యనం మోక్షమ్!
అంబే!మూలం జగంబంతన్!
2.గర్భగత"-త్యాగశీల"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.గగ.గణములు.వృ.సం.11.
ప్రాసనియమము కలదు.
కోరు!నీతిమార్గం భూమిన్!
జారచోర తీరే?నాశమ్!
చారు శీల మెంచే!వాడౌ!
ఆరనీకు!జీవంజ్యోతిన్!
3.గర్భగత"-మాతా"-వృత్తము.వృ.సం.24.
ప్రాసనియమము కలదు.
కులము నిల్పు నాశాంతంబున్!
చలిత బుద్ధియే?దుష్కర్మమ్!
స లలితం బదే?సద్ధర్మమ్!
అలల సాగరిం!దాటింపన్?
4.గర్భగత"-మానయా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.న.య.ర.య.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుంభీపాత నరకంబేలన్?కోరు నీతి మార్గం భూమిన్!
జంబూద్వీప జననం పుణ్యమ్!జార చోర తీరే!నాశమ్?
శంభో!శంకర యనం మోక్షమ్!చారు శీల మెంచే వాడౌ?
అంబే!మూలం జగం బంతన్!ఆరనీకు జీవం జ్యోతిన్!
5.గర్భగత"-నీతి కోరు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.మ.స.య.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోరు నీతి మార్గం!భూమిన్!కులము నిల్పు నాశాంతంబున్?
జార చోర తీరే!నాశమ్!చలిత బుద్ధియే?దుష్కర్మమ్!
చారు శీల మెంచే!వాడౌ?స లలితంబదే?సద్ధర్మమ్!
ఆరనీకు జీవం జ్యోతిన్!అలల సాగరిం!దాటింపన్?
6.గర్భగత"-సమయతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.మ.స.య.మ.త.స.గగ.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కోరు నీతి మార్గం భూమిన్!కులము నిల్పు నాశాంతంబున్?కుంభీపాత
నరకం బేలన్?
జార చోర తీరే!నాశమ్!చలిత బుద్ధియే?దుష్కర్మమ్!జంబూ ద్వీప
జననం పుణ్యమ్!
చారు శీల మెంచే!వాడౌ?స లలితంబదే?సద్ధర్మమ్!శంభో!శంకర యనం
మోక్షమ్!
ఆరనీకు!జీవంజ్యోతిన్!అలల సాగరిం దాటింపన్?అంబే!మూలం జగం
బంతన్?
7.గర్భగత"-ఆశాంత"-వృత్తము.
ధృతిఛందము.న.ర.మ.మ.న.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కులము నిల్పు నాశాంతంబున్?కుంభీపాత నరకం బేలన్?
చలిత బుద్ధియే?దు ష్కర్మమ్!జంబూ ద్వీప జననం పుణ్యమ్?
స లలితం బదే?సద్ధర్మమ్!శంభో!శంకర యనం మోక్షమ్!
అలల సాగరిం దాటింపన్?అంబే!మూలం జగంబంతన్?
8.గర్భగత"-మన మరయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.మ.మ.న.మ.ర.య.గగ.గణములు.యతులు.10,19. ప్రాసనియమము కలదు.వృ.సం.
కులము నిల్పు నాశాంతంబున్?కుంభీపాత నరకం బేలన్?కోరు నీతి
మార్గం భూమిన్!
చలిత బుద్ధియే?దుష్కర్మమ్!జంబూ ద్వీప జననం పుణ్యమ్?జార చోర
తీరే!నాశమ్?
స లలితం బదే?సద్ధర్మమ్!శంభో శంకర యనం మోక్షమ్!చారు శీల
మెంచే వాడౌ?
అలల సాగరిం దాటింపన్?అంబే!మూలం జగంబుతన్?ఆరనీకు
జీవంజ్యోతిన్!
9,గర్భగత"-కోరు నీతి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.మ.త.స.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోరు నీతి మార్గం భూమిన్?కుంభీపాత నరకంబేలన్?
జార చోర తీరే!నాశమ్!జంబూ ద్వీప జననం పుణ్యమ్?
చారు శీల మెంచే!వాడౌ?శంభో!శంకర యనం మోక్షమ్!
ఆరనీకు జీవంజ్యోతిన్?అంబే!మూలం జగంబంతన్?
10,జార చోర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.మ.స.య.స.య.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోరు నీతి మార్గం!భూమిన్?కుంభీపాత నరకం బేలన్?కులము నిల్పు
నాశాంతంబున్?
జార చోర తీరే?నాశమ్!జంబూ ద్వీప జననం పుణ్యమ్?చలిత బుద్ధి యే!
దుష్కర్మమ్?
చారు శీల మెంచే వాడౌ?శంభో!శంకర యనన్?మోక్షమ్!చారు శీల
మెంచే!వాడౌ?
ఆరనీకు జీవం జ్యోతిన్?అంబే!మూలం జగంబంతన్?అలల సాగరిన్
దాటింపన్?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.