గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2020, గురువారం

అష్టావధానము....ఇప్పుడే భక్తి సాధనమ్ వాట్సప్ సమూహములో శ్రీ బండికాడ అంజయ్యావధాని, శ్రీ ముద్దు రాజయ్య అవధాని, శ్రీ, మైలవరపు మురళీకృష్ణ అవధాని చేయుచుండగా నేనును చేసిన పూరణలు

జైశ్రీరామ్.
ఇప్పుడే భక్తి సాధనమ్ వాట్సప్ సమూహములో శ్రీ బండికాడ అంజయ్యావధాని, శ్రీ ముద్దు రాజయ్య అవధాని, 
శ్రీ, మైలవరపు మురళీకృష్ణ అవధాని చేయుచుండగా 
నేనును చేసిన పూరణలు..
౧. సమస్యాపూరణము.
అష్టకాలవిద్యాచరణ్....శునకము సింహాసనమ్ము శోభను పెంచెన్

వినువారలుండిరనుచును
కన సాధ్యము కానిదానిఁ గనచేయుదురా?
ఘనముగనెపుడెచ్చటనే
శునకము సింహాసనమున శోభను గూర్చెన్?

నిషిద్ధాక్షరి
న ల ర
అక్షరాలను నిషేధిస్తూ రాబోయే వినాయక చవితి యొక్కగొప్పదనాన్ని స్వేచ్ఛా ఛందంలో వివరించండి
చుక్కాయపల్లి శ్రీదేవి౨. 

గణపతి పండుగ శోభయె
గణుతించుగ బోము సుకవి గాయకతతియీ
గణపతి జృంభిత జీవము
గణుతిగ క్షీణింపజేయకాంక్షయె భువిపై.

౩. దత్తపదిఞానప్రసూనాశర్మ.
.జీలకర్ర, మెంతులు, ఆవాలు,ధనియాలు

ఈ వంటింటి దినుసులు ఉపాయోగించి
షోడశగౌరీపూజ విశిష్టతను తెలుపండి
షోడశ గౌరీ పూజకు
స్త్రీలిలజీరకము మెంతి చిటికెడు ధనియాల్
మేలగునావాల్ రసమును
చాలగ నర్పించుటయెప్రశస్తము కనగన్.
జీలకఱ్ఱ మెంతులు ఆవాలు ధనియాలు.

౪వర్ణన..సంగీతంనరసింహారావు.వర్ణన
పార్వతి తను తపస్సుచేసుకోవడానికి వీలుగా కాపలాగా ఉంచడానికి నలుగుపిండితో బాలుని సృష్టించినసందర్భమును వర్ణిస్తూ ఉత్పలమాల వృత్తంలో పద్యం చెప్పగలరు. 

స్నానము చేయఁబోవుచును చక్కగపిండిని బొమ్మ చేసి తా
ప్రాణము పోసి ద్వారమున పాలకవృత్తిని నిల్పె శూలమున్
ధీనిధి పార్వతిచ్చె తనదీవన లిచ్చుచు పుత్రునట్లుగా
తాను ముదంబునొందుచు., విధాతమరేగతి చేయనుండెనో?

౫. అంత్యాక్షరి...డా.మలుగాంజయ్యావధాని.
అంత్యాక్షరం....మా
మానుట ధర్మము మహితులు
ధీనిధులగు వారిచెంత తెలియని పనులన్
జ్ఞానము సంప్రాప్తించును
మానితముగ గౌరవంబు మహిని లభించున్.

౬. న్యస్తాక్షరి.  శ్రీమతి సరస్వతీ రామశర్మ..      
అం భా సు త 
అనే ఆక్షరాలను..పాదాద్యక్షరాలుగా ఉంయోగిస్తూ..స్వేచ్చాఛందంలో..

వినాయకచవితి రోజు ..పెట్టే నైవేద్యం విశిష్టత నుశతెలుపగలరని కోరుతున్నాను..
అంబ సుతుని గొలిచి యనుపమ రీతిలో
భాసురపరమాన్న పాత్రనుంచి
సుచిగ రుచిగ చేసి సూపంబు నటనుంచి,
తనియఁ బెట్ట వలయు ధర్మమదియె.

౭. అశువు.
గత కొద్దికాలంగా కురుస్తున్న వర్షాన్ని,నిండిన చెరువులని,పొంగుతున్న వాగులను చూసి హాలికుడి హర్షాన్ని  మీ ఇష్టమైన వృత్తంలో చెప్పవలసినదిగా ప్రార్థన
వర్షము హాలికుని ఆనందము.
సమయమునకు తగిన చక్కని వానలు
కురుయుచుండ మనసు మురియుచుండె.
పంటలెల్ల పండు ప్రఖ్యాతిగానింక
వరుణ దేవ! నీకు వందనములు.

౮. చిత్రము నకు పద్యము. పండరి రాధాకృష్ణ. 
అన్నపూర్ణ శివునకు భిక్ష వేయుట. చిత్రం.
పాత్ర పట్ట శివుడు పార్వతీదేవి తా
భిక్షవేయుచుండె వింత యిదియె.
కారణంబు కలుగ కర్తవ్యమును వీడి

మెలగబోరు మహితులలఘులిలను..

పూరణలకు పట్టిన సమయము నలభై ఐదు నిమిషములు.
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.