జైశ్రీరామ్.
ఉత్సుకద్వయ,మునివర,ధీమహి,తావులద్వయ,కలి వికార ద్వయ,కామనా,ఢఢంభరగర్భ"-మహిబ్రోవు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"-మహిబ్రోవు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.న.భ.మ.స.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కామిత కామన కామతన్!కలి వికారము పెచ్చెన్!కాటుక కన్నులు రోధిలెన్!
సామత లేదయె?స్వార్ధతన్!సలిల మింకెను చూడన్?చాటిరి గొప్పలు
పెక్కులున్!
తామస ధృష్టికి తావయెన్?తలపరైరిల దైవమున్!దాటిరి సర్వము
దర్పులై!
ధీ మహి బ్రోవు సదా శివా!తెలియ జేయుమి నీతినిన్!ధీటుగ నిల్పుమి!
సత్యమున్!
1.గర్భగత"-ఉత్సుక ద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
1.కామిత కామన కామతన్. 2.కాటుక కన్నులు రోధిలెన్!
సామత లేదయె?స్వార్ధతన్! చాటిరి గొప్పలు పెక్కులున్!
తామస ధృష్టికి తావయెన్! దాటిరి సర్వము దర్పులై!
ధీమహి బ్రోవు సదాశివా! ధీటుగ నిల్పుమి సత్యమున్!
2.గర్భగత"-మునివర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.భ.గగ.గణములు.వృ.సం.56.
ప్రాసనియమము కలదు.
కలి వికారము పెచ్చెన్!
సలిల మింకెను చూడన్!
తలప రైరిల దైవమున్!
తెలియ జేయుమి నీతినిన్!
3.గర్భగత"-ధీమహి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.న.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కామిత కామన కామతన్!కాటుక కన్నులు రోధిలెన్?
సామత లేదయె?స్వార్ధతన్!చాటిరి గొప్పలు పెక్కులున్!
తామస ధృష్టికి తావయెన్!దాటిరి సర్వము దర్పులై!
ధీ మహి బ్రోవు సదా శివా!ధీటుగ నిల్పుమి సత్యమున్!
4.గర్భగత"-తావుల ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.న.భ.మ.స.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కలి వికారము పెచ్చయెన్!కాటుక కన్నులు రోధిలెన్?
సలిల మింకెను చూడన్!చాటిరి గొప్పలు పెక్కులున్!
తలప రైరిల?దైవమున్!దాటిరి సర్వము దర్పులై!
తెలియ జేయుమి నీతినిన్!ధీటుగ నిల్పుమి సత్యమున్?
2.
కలి వికారము పెచ్చెన్!కామిత కామన కామతన్?
సలిల మింకెను చూడన్!సామత లేదయె!స్వార్ధతన్!
తలప రైరిల దైవమున్!తామస దృష్టికి తావయెన్?
తెలియ జేయుమి నీతినిన్!ధీ మహి బ్రోవు సదా శివా!
5.గర్భగత"-కలివికార"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.న.భ.మ.స.స.య.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కలి వికారము పెచ్చెన్!కాటుక కన్నులు రోధిలెన్!కామిత కామన కామతన్!
సలిల మింకెను చూడన్!చాటిరి గొప్పలు పెక్కులున్!సామత లేదయె?
స్వార్ధతన్!
తలప రైరిల దైవమున్!దాటిరిసర్వము దర్పులై!తామస ధృష్టికి తావయెన్!
తెలియ జేయుమి నీతినిన్!ధీటుగ నిల్పుమి సత్యమున్!ధీ మహి బ్రోవు
సదా శివా!
2.
కలి వికారము పెచ్చెన్!కామిత కామన కామతన్!కాటుక కన్నులు రోధిలెన్?
సలిల మింకెను చూడన్!సామత లేదయె?స్వార్ధతన్!చాటిరి గొప్పలు
పెక్కులున్!
తలప రైరిల దైవమున్!తామస ధృష్టికి తావయెన్!దాటిరి సర్వులు
దర్పమున్!
తెలియ జేయుమి నీతినిన్!ధీ మహి బ్రోవు సదా శివా!ధీటుగ నిల్పుమి
సత్యమున్!
6.గర్భగత"-కామనా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటుక కన్నులు రోధిలెన్?కామిత కామన కామతన్?
చాటిరి గొప్పలు పెక్కులున్!సామత లేదయె?స్వార్ధతన్!
దాటిరి సర్వులు దర్పమున్!తామస ధృష్టికి తావయెన్!
ధీటుగ నిల్పుమి సత్యమున్!ధీ మహి బ్రోవు సదా శివా!
7.గర్భగత"-ఢంభర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.భ.ర.న.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటుక కన్నులు రోధిలెన్?కామిత కామన కామతన్!కలి వికారము
పెచ్చెన్!
చాటిరి గొప్పలు పెక్కులున్!సామత లేదయె?స్వార్ధతన్!సలిల మింకెను
చూడన్?
దాటిరి సర్వులు దర్పమున్!తామస ధృష్టికి తావయెన్!తలపరైరిల
దైవమున్!
ధీటుగ నిల్పుమి సత్యమున్!ధీ మహి బ్రోవు సదాశివా!తెలియ జేయుమి!
నీతినిన్!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.