గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2020, శుక్రవారం

ధీనుతా,సంబర,మోహనా,ద్విజతగా,సుందర,మోహాంబుధీ,పావక,సుమనా,సంభరిత,జంత్రీ,జతాభయా,జగవాసా,జామినీ,చామినీ,జగన్మోహ,గర్భ"-సదానంద"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ధీనుతా,సంబర,మోహనా,ద్విజతగా,సుందర,మోహాంబుధీ,పావక,సుమనా,సంభరిత,జంత్రీ,జతాభయా,జగవాసా,జామినీ,చామినీ,జగన్మోహ,గర్భ"-సదానంద"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         

సదానంద సందోహ సంభరిత చిత్తా!జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!
నిదానంబు జేకూర్చు!నీప్రభ లనంతమ్!నిగూఢ మెంచన్?నిగమాంత
                                                                              వేద్యా!శుభా!
చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!జిగీష దక్షా!జిగిదేఱు భద్రాత్మకా!
వదాన్యుండ వీవోయి!పావకుడ వీవే!ప్రగాఢ విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!

అర్ధములు:-
జిగీష=పట్టుదల,జిగిదేఱు=కాంతివంతమగు,ప్రగాఢ=ధృడమైన,
ప్రగడ=ప్రధానుడు,

1.గర్భగత"-ధీనుతా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.య.య.ల.గణములు.వృ.సం.74.
ప్రాసనియమము కలదు.
సదానంద సందోహ!
నిదానంబు జేకూర్చు!
చిదానంద శ్రీకాంత!
వదాన్యుండ వీవోయి!
2.గర్భగత"-సంబర"-వృత్తము.
అతిజగతీఛందము.య.య.జ.స.గ.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిదానంబు జేకూర్చు నీప్రభ లనంతమ్!
చిదానంద శ్రీకాంత జీవ పరిపోషా!
వదాన్యుండ వీవోయి!పావకుడ వీవే?
3.గర్భగత"-మోహనా"-వృత్తము.
ధృతిఛందము.య.య.జ.స.ర.య.గణములు.యతి12,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద సందోహ సంభరిత చిత్తా!జగన్నివాసా!
నిదానంబు జేకూర్చు నీ ప్రభ లనంతమ్!నిగూఢ మెంచన్?
చిదానంద శ్రీకాంత!జీవ పరి పోషా!జిగీష దక్షా!
వదాన్యుండ వీవోయి!పావకుడ వీవే?ప్రగాఢ విశ్వా!
4.గర్భగత"-ద్విజతగా"-వృత్తము.
అతిజగతీఛందము.జ.త.జ.త.గ.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!
నిగూఢ మెంచన్?నిగమాంత వేద్యా!శుభా!
జిగీష దక్షా!జిగి దేఱు!భద్రాత్మకా!
ప్రగాఢ విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!
5.గర్భగత"-సుందర"-వృత్తము.
కృతిఛందము.జ.త.జ.త.ర.ర.గల.గణములు.యతులు.6,14.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!సదానంద సందోహ!
నిగూఢ మెంచన్?నిగమాంత వేద్యా!శుభా!నిదానంబు జేకూర్చు!
జిగీష దక్షా!జిగి దేఱు భద్రాత్మకా!చిదానంద!శ్రీకాంత!
ప్రగాఢ!విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీ వోయి?
6.గర్భగత"-మోహాంబుధీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.జ.త.ర.ర.ర.న.గగ.గణములు.యతులు.6,14,21.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిగూఢ మెంచన్?నిగమాంత వేద్యా!శుభా!నిదానంబు జేకూర్చు!నీ ప్రభ
                                                                                 లనంతమ్!
జిగీష దక్షా!జిగి దేఱు భద్రాత్మకా!చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!
ప్రగాఢ విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?
7.గర్భగత"-పావక"-వృత్తము.
అతిశక్వరీ"-వృత్తము.స.య.జ.త.త.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగదైక మోహాంబుధీ?సదానంద సందోహ!
నిగమాంత వేద్యా?నిదానంబు జేకూర్చు!
జిగిదేఱు భద్రాత్మకా?చిదానంద శ్రీకాంత!
ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?
8.గర్భగత"-సుమనా"-వృత్తము.
ప్రకృతిఛందము.స.య.జ.త.త.త.య.గణములు.యతులు.9,16,
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగదైక మోహాంబుధీ?సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిగమాంత వేద్యా?నిదానంబు జేకూర్చు!నీ ప్రభ లనంతమ్?
జిగిదేఱు భద్రాత్మకా?చిదానంద!శ్రీకాంత!జీవ పరిపోషా!
ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?
9.గర్భగత"-సంభరిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.జ.త.త.త.య.జ.గగ.గణములు.యతులు.
9,16,22,ప్రాసనియమము కలదు.వృ.సం.
జగదైక మోహాంబుధీ?సదానంద సందోహ సంభరిత చిత్తా!జగన్నివాసా!
నిగమాంత వేద్యా!నిదానంబు జేకూర్చు!నీ ప్రభలనంతమ్?నిగూఢ
                                                                                  మెంచన్?
జిగి దేఱు భద్రాత్మకా?చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!జిగీష దక్షా!
ప్రగ డీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?ప్రగాఢ!విశ్వా!
10,గర్భగత"-జంత్రీ"-వృత్తము.
జగతీఛందము.జ.త.త.త.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సదానంద సందోహ!
నిగూఢ మెంచన్?నిదానంబు జేకూర్చు!
జిగీష!దక్షా!చిదానంద శ్రీ కాంత!
ప్రగాఢ!విశ్వా!వదాన్యుండ వీవోయి?
11.గర్భగత"-జతాభయా"-వృత్తము.
ధృతిఛందమయాజ.త.త.త.భ.య.గణములు.యతులు.6,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిగూడ మెంచన్?నిదానంబు జేకూర్చు!నీ ప్రభలనంతమ్?
జిగీష దక్షా!చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!
ప్రగాఢ విశ్వా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?
12.గర్భగత"-జగవాసా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.త.త.భ.య.స.య.లగ,గణములు.యతులు
6,13,19,ప్రాసనియమము కలదు.వృ.సం.                                                     జగన్నివాసా!సదానంద సందోహ సంభరిత చిత్తా!జగదైక  మోహాంబుధీ?
నిగూఢ మెంచన్?నిదానంబు జేకూర్చు!నీప్రభ లనంతమ్?నిగమాంత
                                                                                        వేద్యా?
జిగీష దక్షా!చిదానంద శ్రీకాంత!జీవపరి పోషా!జిగి దేఱు భద్రాత్మకా?
ప్రగాఢ విశ్వా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?ప్రగడీవె?సర్వేశ్వరా!
13.గర్భగత"-జామినీ"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.జ.మ.న.గగ.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సంభరిత చిత్తా!
నిగుఢ మెంచన్?నీ ప్రభ లనంతమ్?
జిగీష దక్షా!జీవ పరిపోషా!
ప్రగాఢ విశ్వా!పావకుడ వీవే?
14.గర్భగత"-చామినీ"-వృత్తము.
ధృతిఛందము.జ.మ.న.త.త.త.గణములు.యతి.12,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.షం.
జగన్నివాసా!సంభరిత చిత్తా?సదానంద సందోహ!
నిగూఢ మెంచన్?నీప్రభ లనంతమ్?నిదానంబు జేకూర్చు!
జిగీష దక్షా!జీవ పరి పోషా!చిదా నంద శ్రీకాంత!
ప్రగాఢ విశ్వా!పావకుడ వీవే?వదాన్యుండ వీవోయి?
15.గర్భగత"-జగన్మోహా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.మ.న.త.త.త.స.య.లగ.గణములు.యతులు
6,12,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సంభరిత చిత్తా!సదానంద సందోహ!జగదైక మోహాంబుధీ?
నిగూఢ మెంచన్?నీప్రభ లనంతమ్?నిదానంబు జేకూర్చు!నిగమాంత
                                                                                      వేద్యా?
జిగీష దక్షా!జీవ పరిపోషా!చిదానంద శ్రీకాంత!జిగి దేఱు భద్రాత్మకా?
ప్రగాఢ విశ్వా!పావకుడ వీవే?వదాన్యుండ వీవోయి?ప్రగడీవె?సర్వేశ్వరా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.